ఎయిర్‌పోర్ట్‌లో బకాయిల కోసం కార్మికులు, కాంట్రాక్టర్ల ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో బకాయిల కోసం కార్మికులు, కాంట్రాక్టర్ల ధర్నా

Jan 9 2026 7:09 AM | Updated on Jan 9 2026 7:09 AM

ఎయిర్

ఎయిర్‌పోర్ట్‌లో బకాయిల కోసం కార్మికులు, కాంట్రాక్టర్ల ధ

‘విద్యుత్‌’ బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

గన్నవరం: స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్‌ సంస్థ చెల్లించాల్సిన బకాయిల కోసం మెటీరియల్‌, లేబర్‌ సప్లయిర్స్‌, కాంట్రాక్టర్లు గురువారం ఆందోళన చేశారు. విమానాశ్రయంలోని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద వీరంతా ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులు మాట్లాడుతూ టెర్మినల్‌ నిర్మాణానికి కార్మికులను, ఇసుక, స్టీల్‌ ఇతర మెటీరియల్‌ను సప్లయ్‌ చేయడం, వివిధ నిర్మాణ పనులు చేసినట్లు తెలిపారు. వీటికి సంబంధించి టెర్మినల్‌ నిర్మాణం చేసిన ఎన్‌కేజీ సంస్థ రూ. 20 కోట్లు వరకు బకాయి పడినట్లు చెప్పారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌ ఈడీ రామాచారికి సమస్యను విన్నవించారు.

ఏపీ ఇరిగేషన్‌ సంఘ క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీ ఇరిగేషన్‌ లాక్‌ సూపరింటెండెంట్స్‌ అసోసియేషన్‌ నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను గురువారం ఆవిష్కరించారు. నగరంలోని ఎస్‌ఈ కార్యాలయంలో గురువారం డైరీని నీటిపారుదల శాఖ ఇరిగేషన్‌ సర్కిల్‌ విజయవాడ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఆర్‌.మోహనరావు, క్యాలెండర్‌ను కేఈ డివిజన్‌ ఈఈ బి.ఆంజనేయప్రసాద్‌, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బందెల ప్రసాద్‌బాబు, కార్యవర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం లాక్‌ సూపరింటెండెంట్‌ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉఫాధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, విజయవాడ సర్కిల్‌ అధ్యక్షుడు సత్తార్‌, ఉపాధ్యక్షుడు దావీదు, కేసీ డివిజన్‌ సెక్రటరీ ఆనంద్‌కుమార్‌, త్రిమూర్తులు, నవీన్‌, రాష్ట్ర కార్యదర్శి మస్తాన్‌ వలీ, మురళీధర్‌, శంకరం, గౌరవాధ్యక్షుడు సీహెచ్‌ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

శిశువుల అక్రమ విక్రయాల్లో 30కి చేరిన అరెస్ట్‌లు

లబ్బీపేట(విజయవాడతూర్పు): శిశువుల అక్రమ విక్రయాల కేసుల్లో ఇప్పటి వరకూ 30 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు నగర డిప్యూటీ కమిషనర్‌ కృష్ణకాంత్‌ పటేల్‌ తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శిశువుల కిడ్నాప్‌ అమ్మకం కేసులకు సంబంధించి పోక్సో యాక్ట్‌ , మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అహ్మదాబాద్‌, గుజరాత్‌, ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో టీములు ఈ రాకెట్‌మూలాలను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఫెర్టిలిటి సెంటర్స్‌ ప్రమేయం ఎంతవరకు ఉంది.. నిజంగా పిల్లల కిడ్నాప్‌ చేశారా లేదంటే తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పిల్లలను ఈ రకమైన అమ్మకానికి పెడుతున్నారా అనే అంశాలను విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 30 మందిని అరెస్టు చేశామని, ఇంకా అనేక మంది నేరస్తుల్సి త్వరలోనే గుర్తించి అరెస్ట్‌ చేస్తామన్నారు. శిశువుల అక్రమ రవాణాకు సంబంధించి మహిళా పోలీస్‌స్టేషన్‌తో పాటు, భవానీపురం, కొత్తపేట, నున్న పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ మురళీకృష్ణ, ఏసీపీలు వైడీ ప్రసాద్‌, లతాకుమారి, వాసవి, తదితరులు పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్‌ శాఖలో బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులు, పీఆర్సీ డీఏ పెంపు తదితర అంశాలను కేబినెట్‌లో చర్చించి ఆమోదించాలని కోరారు. విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సంఘం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జీకే వీరభద్రయ్య, ముప్పసాని రామకృష్ణ, సంఘం స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.శ్రీధర్‌, స్టేట్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ, డైరీ కమిటీ చైర్మన్‌ రాజయ్య, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీలు మురళీమోహన్‌, చలపతి, సీపీడీసీఎల్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీలు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో బకాయిల కోసం కార్మికులు, కాంట్రాక్టర్ల ధ1
1/2

ఎయిర్‌పోర్ట్‌లో బకాయిల కోసం కార్మికులు, కాంట్రాక్టర్ల ధ

ఎయిర్‌పోర్ట్‌లో బకాయిల కోసం కార్మికులు, కాంట్రాక్టర్ల ధ2
2/2

ఎయిర్‌పోర్ట్‌లో బకాయిల కోసం కార్మికులు, కాంట్రాక్టర్ల ధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement