రుచి
మాటున
● జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఇటీవల తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (టీజీసేఫ్) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోజుల తరబడి చికెన్, మటన్ నిల్వలని దాచి అలాగే వినియోగిస్తున్నట్లు, సింథెటిక్ రంగులను వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. బార్ అండ్ రెస్టారెంట్లతోపాటు స్వీట్ హౌస్, ఖారా తయారీ కంపెనీలు, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న 13 షాపుల లైసెన్సులను సస్పెండ్ చేసి మూసివేశారు.
● బోధన్ పట్టణంతోపాటు నందిపేట్ మండల కేంద్రంలో ఇటీవల ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మిగిలిపోయిన ఆహారాన్నే మళ్లీ మరుసటి రోజుకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. నోటీసులు జారీ చేసి షాపులను మూసేయాలని ఆదేశించారు. లైసెన్స్ లేని మరికొన్ని హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. పాడైపోయిన మయోనైజ్(సాస్), కుళ్లిన చికెన్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నాసిరకం వంట నూనెలను వినియోగిస్తున్నట్టు తనిఖీల్లో తేలిందని అధికారులు అంటున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాలంతో పరుగులు తీస్తూ బిజీబిజీగా గడుపుతున్న ఉద్యోగ, వ్యాపార వర్గాలు ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లపై ఆధారపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు విచ్చలవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. రోజుల తర బడి కుళ్లిన మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి, అదే మాంసాన్ని వేడివేడిగా వినియోగదారులకు వడ్డిస్తున్నారు. లేబుల్ లేని ఆహార పదార్థాలు, తినుబండా రాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, నాసిరకం, కల్తీ నూనెలతో అడ్డగోలుగా దందా కొనసాగిస్తున్నారు. విచ్చలవిడిగా ఆహార కల్తీలకు పాల్పడుతూ, ప్రజారోగ్యం పాలిట శాపంగా పరిణమిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై గత కొద్దిరోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు చేపడుతోంది. అధికారుల తనిఖీల్లో ఆహార భద్రత విషయంలో విస్మ యం గొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
సిబ్బంది లేక మొక్కుబడిగా తనిఖీలు..
ఆహార భద్రత విభాగం అధికారుల పర్యవేక్షణ, ని రంతర తనిఖీలతో ఆహార కల్తీ నియంత్రణకు అవకాశం ఉంటుంది. అయితే ఈశాఖలో జిల్లా అధికారితో పాటు ఒకరిద్దరు మాత్రమే సిబ్బంది ఉండటం, ఒక్కరికే రెండు, మూడు జిల్లాల ఇన్‌చార్జీ బాధ్యత లు ఉండటంతో పర్యవేక్షణ కొరవడుతోంది. అవసరమైన సిబ్బంది లేక అన్నిచోట్ల తనిఖీలు చేపట్టలేకపోతున్నారు. ఒకవేళ తనిఖీలు చేసి శాంపిళ్లను సేకరించినా వాటి రిపోర్టు వచ్చేందుకు మరో 15 రోజు ల వరకు సమయం పడుతోంది. ఈలోగా కేసు పరి స్థితి తారుమారవుతోంది. లైసెన్స్ లేకుండా వంద లాది సంఖ్యలో హోటళ్లు నిర్వహిస్తున్నా అధికారు లు నోటీసులకే పరిమితం అవుతున్నారు. ఆహార పదార్థాల నాణ్యత నిర్ధారించేందుకు పరీక్ష కేంద్రాల ను పెంచాలని, ఆహార తనిఖీలను నిరంతరం కొనసాగించాలని వినియోగదారులు కోరుతున్నారు.
జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో నిరంతరం ఆహార తనిఖీలు చేపడుతున్నాం. పలు హోటళ్లలో రోజుల తరబడి మాంసం నిల్వలు, లేబుల్ లేని పదార్థాలు, కల్తీ నూనె వినియోగిస్తున్నట్టు గుర్తించాం. శాంపిళ్లను సేకరించి ల్యాబొరేటరీకి పంపుతున్నాం. ఫలితాల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నాం. తనిఖీలను నిరంతరం చేపడతాం.
– నవిత, ఫుడ్ సేఫ్టీ అధికారి,
నిజామాబాద్
బోధన్ పట్టణంలో తనిఖీలు చేపడుతున్న అధికారులు (ఫైల్)
పాడైన పదార్థాలను పారబోయిస్తున్న అధికారులు (ఫైల్)
నూనె నుంచి మసాలాల వరకు..
జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కనీస శు భ్రత కనిపించడం లేదు. వంటనూనెల విషయంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. నా సిరకం, కల్తీ నూనెలను రోజుల తరబడి వినియోగిస్తూ ప్రజారోగ్యాన్ని కబలిస్తున్నాయి. పా నీపూరీ, ఫాస్ట్‌ఫుడ్ హోటళ్లలో అయితే ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నారు. రో జుల తరబడి చికెన్, మటన్‌ను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి, మసాలాలు, రకరకాల ఫ్లేవర్లతో వేడివేడి గా కస్టమర్లకు అందిస్తున్నారు. పాలు, టీ పొడి, కారం, పసుపు, మసాలా, మాంసం, నూనె, ప్యాకేజ్డ్ ఫుడ్, నీరు ప్రతిదాన్ని కల్తీ చేయడం అ ధికారుల తనిఖీల్లో బయటపడుతోంది. మరోవైపు అధికారుల కంటికి చిక్కకుండా వందల సంఖ్యలో హోటళ్లు తమ దందాను కొనసాగిస్తు న్నాయి. కాగా ఆహార కల్తీలతో పెద్ద ఎత్తున ప్ర జలు వ్యాధుల బారిన పడుతూ ఆస్పత్రుల్లో చే రుతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆహా రం కల్తీ అయితే మొదట చిన్నారుల్లో తీవ్ర ప్ర భావం చూపుతుందని, కలుషిత, కల్తీ ఆహారంతో అతిసారం నుంచి కేన్సర్ వరకు రోగాల బా రిన పడుతున్నారని చెబుతున్నారు.
కుళ్లిన మాంసం, చెడిపోయిన
పదార్థాల వినియోగం
హోటళ్లు, రెస్టారెంట్లలో జోరుగా దందా
అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..
ఫాస్ట్‌ఫుడ్, పానీపూరీ బండ్ల వద్ద అధ్వానంగా పరిస్థితి
తనిఖీలు కొనసాగాలంటున్న
వినియోగదారులు


