డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలోని ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల (పీఏసీఎస్) నామినేటెడ్ చై ర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీ ఆశావహులను ఊరి స్తున్నాయి. కొంతకాలంగా ఈ పదవుల భర్తీపై ఎ న్నో ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులకు కొన్ని నియోజకవర్గాల్లో ఊరట లభించగా, మరికొ న్ని చోట్ల నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సుదర్శన్ రెడ్డి నియోజకవర్గం బోధన్ లో ఇప్పటికే 18 సొసైటీలకు ప్రభుత్వం చైర్మన్లను నియమించడంతో అక్కడ సందడి నెలకొంది. పాలకవర్గాల ప్రమాణస్వీకారం సైతం పూర్తయింది. ఇదే క్రమంలో ప్రజాప్రతినిధుల నుంచి నిజామాబాద్‌రూరల్‌లో 17, బాల్కొండలో 19, బాన్సువాడలో 13 సొసైటీల పదవుల భర్తీకి సంబంధించిన అభ్య ర్థుల పేర్ల ప్రతిపాదనలు రాష్ట్ర శాఖకు వెళ్లాయి. అ క్కడి నుంచి పరిశీలన నిమిత్తం జిల్లా సహకార అధి కారి (డీసీవో) కార్యాలయానికి కూడా ఫైళ్లు పంపించారు. నిజామాబాద్ రూరల్ పేర్ల జాబితా పరిశీల న పూర్తికాగా, బాల్కొండ, బాన్సువాడ జాబితా ప రిశీలన జరుగుతోంది. చైర్మన్ పదవి కోసం ప్రతిపాదించిన పేర్లు గల వ్యక్తులకు సొసైటీలో సభ్యత్వం ఉందా? ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నా రు? తీసుకున్న రుణాలకు బకాయిలు ఏమైనా ఉ న్నాయా? అనే కోణంలోనే కాకుండా వ్యక్తిత్వ ప్రవర్తన తీరుపై అధికారులు విచారణ చేసి నివేదికలను రాష్ట్ర శాఖకు పంపుతున్నారు. నిజామాబాద్‌రూర ల్, బాల్కొండ, బాన్సువాడ ప్రాంతాలకు సంబంధించిన పదవుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
నిరీక్షణపై అసంతృప్తి
పక్క నియోజకవర్గాల నుంచి అభ్యర్థుల జాబితాలు డీసీవో ఆఫీసు చేరగా, ఇప్పటికే బోధన్ లో నాయకులు ప్యాక్స్ చైర్మన్ కుర్చీల్లో కూర్చున్నారు. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో ని సొసైటీల విషయంలో మాత్రం ప్రతిపాదిత జాబితా ఇంకా కొలిక్కి రావడం లేదు. ఆర్మూర్ కు సంబంధించిన చైర్మన్‌ల జాబితా చాలా రో జుల క్రితమే రాష్ట్ర శాఖకు వెళ్లినట్లుగా తెలుస్తుండగా, వెరిఫికేషన్ కోసం డీసీవో కార్యాలయాని కి మాత్రం రాలేదు. తమ ప్రాంతాల్లో పదవుల భర్తీ కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలంటూ ఆ ర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, ఆశావహులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉంటుందో..ఊడుతుందో..?
మరోవైపు పదవులు దక్కించుకున్న వారిలోనూ, త్వరలో నియమితులు కాబోతున్న వారిలోనూ కొత్త ఆందోళన మొదలైంది. సొసైటీలకు నామినేటెడ్ చైర్మన్ల నియామకం చెల్లదంటూ ఇటీవల హైకోర్టు వాఖ్యలు చేయడంతో ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూసి దక్కించుకున్న పదవులు కోర్టు ఆదేశాలతో కొద్ది రోజులకే ఎక్కడ ఊడిపోతాయోనని టెన్షన్ పడుతున్నారు. కుర్చీలో కూర్చున్న ఆనందం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందా అన్న చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో, సొసైటీల్లో జోరుగా సాగుతోంది.
బోధన్ నియోజకవర్గంలోనే
నియామకాలు పూర్తి
వెరిఫికేషన్ దశలో బాల్కొండ,
బాన్సువాడల జాబితా
ఆర్మూర్ నియోజకవర్గంలో జాప్యంపై కాంగ్రెస్ ఆశావహుల్లో అసహనం
నామినేటెడ్ నియామకాలు చెల్లవన్న కోర్టు వ్యాఖ్యలతో కుర్చీ ఎక్కిన వారిలోనూ టెన్షన్


