నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

న్యూస్‌రీల్‌

● కనుల పండువగా కల్యాణోత్సవం

వాతావరణం

ఉదయం చలి గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. రాత్రి పొగమంచు కురుస్తుంది. చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి.

అక్షర జ్ఞానానికి ప్రత్యేక..

విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను పెంపొందించేందుకు విద్యా శాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

– 8లో u

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌) : భీమ్‌గల్‌ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నింబాచల క్షేత్రంపై కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని గురువారం కన్నుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఉదయం 9.30 గంటలకు గర్భాలయంలో ప్రధాన యాగ్నికుల ఆధ్వర్యంలో స్వామివారి మూలవిరాట్టుకు శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. ప్రతి ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ కల్యాణ మహోత్సవంలోని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అర్చకులు వివరించారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు ప్రసాద అక్షింతలు అందించి ఆశీర్వదించారు. రాత్రి వివాహ స్థాలీపాక హోమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

సర్వసమాజ్‌ ఆధ్వర్యంలో

పట్టు వస్త్రాలు, పుస్తె మట్టెలు..

స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్‌గల్‌ సర్వసమాజ్‌ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలు, పుస్తె మట్టెలను సమర్పించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లికార్జున్‌రెడ్డి, ఆరె రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

గోవింద నామస్మరణతో

మార్మోగిన లింబాద్రిగుట్ట

భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

వైభవంగా కొనసాగుతున్న

బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement