వేగవంతం చేయాలని ఆదేశించాం
● వసూలు లక్ష్యం రూ.31.31కోట్లు
● ఇప్పటివరకు వసూలైంది రూ.6.68 కోట్లు మాత్రమే..
● గ్రామాల్లో మందకొడిగా ప్రక్రియ
● నాలుగు నెలల్లో రూ.24.42కోట్లు రాబట్టాల్సిన పరిస్థితి
పల్లె అభివృద్ధి చెందాలన్నా.. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగాలన్నా గ్రామ పంచాయతీ ఖజానా కళకళలాడాల్సిందే. పన్ను వసూళ్లపైనే పంచాయతీ మనుగడ ఆధారపడుతుంది! అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల ప్రక్రియ నెమ్మదించడంతో నిధులు లేక జీపీల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉండగా.. రూ.24.42 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు నెలల గడువు మాత్రమే ఉన్నప్పటికీ, పన్ను వసూళ్లలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. జి ల్లా, మండల స్థాయి అధికారులతోపాటు పంచా యతీ కార్యదర్శులు పన్ను వసూళ్లపై సరైన దృష్టి సారించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, రోజువారీ నిర్వహణ భారంగా మారుతోంది. 2027 మార్చి నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 545 గ్రామ పంచాయతీల నుంచి ఇంటి, నీటి, వ్యాపార తదిత ర పన్ను మొత్తం రూ.31.11 కోట్లు వసూలు చేయా లని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. అ యితే ఇప్పటి వరకు కేవలం రూ. 6.68 కోట్లు (20 శాతం) మాత్రమే వసూలయ్యాయి. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే మిగిలిన నాలుగు నెలల్లో ఇంకా రూ. 24.42కోట్లు వసూలు చేయాల్సి ఉంది. తక్కువ స మయంలో ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు రాబట్టడం పంచాయతీ సిబ్బందికి సవాలుగా మారింది.
గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంరావు ఇటీవల ఆదేశించారు. డిసెంబర్ పూర్తయ్యే నాటికి పన్ను వసూళ్లను నూరుశాతం పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు. – నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి


