సబ్‌ రిజిస్ట్రార్‌ ఇబ్బందులు పెడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ ఇబ్బందులు పెడుతున్నారు

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

బోధన్‌టౌన్‌(బోధన్‌): సబ్‌ రిజిస్ట్రార్‌ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ డాక్యుమెంట్‌ రైటర్లు గురువారం బోధన్‌ పట్టణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్‌ రైటర్‌ల ప్రతినిధి హరికాంతాచారి మాట్లాడుతూ.. బోధన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రతి డాక్యుమెంట్‌ను 22–ఏ పరిధిలోకి వస్తుండని రిజిస్ట్రేషన్‌ చేయకుండా డాక్యుమెంట్‌ రైటర్లను, రిజిస్ట్రేషన్‌ల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22–ఏలో ఉన్న సర్వే నంబర్లకు మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి అనుమతి లెటర్‌ తీసుకువచ్చినా పట్టించుకోకుండా డాక్యుమెంట్‌లను పక్కన పెడుతున్నారన్నారు. లోన్‌లు, ఇతర ఆస్థి వివరాల కోసం ప్రజలు ఈసీ కోసం దరఖాస్తు చేసుకుంటే కార్యాలయ సిబ్బంది ఇవ్వడం లేదని వాపోయారు. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని దౌత్యాల్‌ తర్పా శివారు సర్వే నం.295లో 2.37 గుంటల భూమి మాత్రమే ప్రభుత్వ భూమిగా నమోదు కాగా.. మిగతా భూమి 79 ఎకారాలను సైతం రిజిస్ట్రేషన్‌ చేయకుండా నిలిపి వేస్తున్నారన్నారు. ఇప్పటికై నా సబ్‌ రిజిస్ట్రార్‌తోపాటు కార్యాలయ సిబ్బంది తమ వైఖరిని మార్చుకొని విధులు నిర్వహించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement