నిజామాబాద్ అర్బన్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదులో పొరపాట్లకు తావులేకుండా జా గ్రత్తలు తీసుకోవాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారుల కు సూచించారు. బీమా పథకం అమలు కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లమై సంబంధిత శాఖల అధికారుల తో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం సమావేశం నిర్వహించిన కలెక్టర్ కీలక సూచనలు చేశారు. మున్సిపల్ కార్యాలయాలు, మండల కేంద్రాల్లోని గ్రామ పంచాయతీల్లో జీవిత బీమా వివరాల నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈ నెల 20వ తేదీ నుంచి వివరాల నమోదు చేపట్టాలని ఆదేశించారు. వివరాలు నమోదు చేసే ఆపరేటర్లు అవగాహన కలిగి ఉండాలని, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని అన్నారు. ప్ర స్తుతానికి ఆహారభద్రత కార్డు ఉన్న వారికే అవకా శం ఉంటుందని, ఆన్లైన్లో వివరాలు నమోదు చే సిన తరువాత బీమా చేసుకున్న వ్యక్తి మొబైల్ ఫో న్కు సమాచారం వస్తుందని తెలిపారు. ఆహార భ ద్రత కార్డు కలిగి ఉన్న వారు ఎక్కడి నుంచైనా న మోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలను ప్రత్యేకంగా రిజిస్టర్లో పొందుపరుస్తూ, రోజువారీగా నివేదిక జిల్లా యంత్రాంగానికి పంపించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషన ల్ కలెక్టర్ భుజంగరావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, నగర పాలక సంస్థ సహాయ క మిషనర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవో లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నమోదు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలి
ప్రస్తుతానికి ఆహార భద్రత కార్డు
ఉన్న వారికే అవకాశం
ఎక్కడి నుంచైనా నమోదు
చేసుకునే వెసులుబాటు
కలెక్టర్ ఇలా త్రిపాఠి


