మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) శుక్రవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో చేయూత పింఛన్‌ల పంపిణీ, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల అందజేత కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌.. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, డీఆర్‌వో గీత, డీఆర్డీవో సాయన్న, ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

మెరుగైన

వైద్య సేవలందించాలి

ఆర్మూర్‌టౌన్‌: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్‌) డాక్టర్‌ శ్రీనివాస్‌ప్రసాద్‌ అన్నారు. పటట్ణంలోని ఏరియా ఆస్పత్రిని ఆయన గురువారం సందర్శించారు. ఓపీ, ఐపీ వార్డులతోపాటు ల్యాబ్‌, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వైద్యులతో మాట్లాడి, రోగులకు మెరుగైన సేవలందించే విధానంపై పలు సూచనలు, సలహాలు అందించారు. వసతుల కొరత, మందుల నిల్వలు, వైద్యులకు అవసరమైన వైద్య పరికరాల వివరాలను నమోదు చేసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రమిదారెడ్డి, ఆర్‌ఎంవో అమృత్‌ రామ్‌ రెడ్డి, వైద్యులు అమరేశ్వర్‌, మోహన్‌రెడ్డి, స్నేహ, జాకీర్‌ హుస్సేన్‌, శ్రీకాంత్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ కృష్ణవేణి, సిబ్బంది ఉన్నారు.

పసుపు పంటను పరిశీలించిన ఆంధ్ర రైతులు

వేల్పూర్‌(ముప్కాల్‌): ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రామంలో సాగువుతున్న పసుపు పంటను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆదర్శ రైతులు బుసిరెడ్డి, సుబ్బారెడ్డి, నర్సారెడ్డి గురువారం పరిశీలించారు. రెంజర్ల సొసైటి చైర్మన్‌ శెట్టి గంగాధర్‌, స్థానిక రైతులు బుల్లెట్‌ రాంరెడ్డి, ఆకుల రవీందర్‌, శెట్టి రవి పసుపు సాగు పద్ధతులను వారికి వివరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అణుగుణంగా అధిక దిగుబడుల కోసం చేపడుతున్న సాగు పద్ధతులు, ఽఆధునిక సస్యరక్షణ చర్యలను వారికి వివరించారు.

ఖేలో ఇండియా రెజ్లింగ్‌ జట్టు కోచ్‌గా సంతోషి

నిజామాబాద్‌అర్బన్‌: ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌’ పోటీల్లో రాష్ట్ర బాలికల రెజ్లింగ్‌ జట్టుకు కోచ్‌గా రుద్రూర్‌కు చెందిన పీడీ మంగోలి సంతోషి ఎంపికయ్యారు. జెడ్పీహెచ్‌ఎస్‌ బాయ్స్‌ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు అరుదైన అవకాశం లభించింది.

ప్రస్తుతం హనుమకొండలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా రెండో విడత రెజ్లింగ్‌ శిక్షణ శిబిరంలో ఆమె క్రీడాకారిణులకు మెలకువలు నేర్పిస్తున్నారు. ఈనెల 11వ తేదీన ప్రారంభమైన శిక్షణ శిబిరం డిసెంబర్‌ 23వ తేదీ వరకు కొనసాగనుంది. జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించేలా సంతోషి కృషి చేయాలని ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement