జూన్‌ నాటికి సాగు నీరందించాలి | - | Sakshi
Sakshi News home page

జూన్‌ నాటికి సాగు నీరందించాలి

Nov 21 2026 3:08 AM | Updated on Nov 21 2026 3:08 AM

వర్ని : సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ పనులను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రిజర్వాయర్‌ పనులను శుక్రవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పది కాలాల పాటు రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నాణ్యత లోపంతో నిర్మాణం చేపడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పనుల్లో నాణ్యత లోపం కనిపిస్తే వెంటనే ప్రశ్నించాలని, తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వర్ని మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు సురేష్‌ బాబా, సిద్దాపూర్‌ సర్పంచ్‌ బాల్‌సింగ్‌, జాకోరా సొసైటీ చైర్మన్‌ దశరథ్‌, పైడిమల్‌ సర్పంచ్‌ అనూష, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement