ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు

Nov 21 2026 3:08 AM | Updated on Nov 21 2026 3:08 AM

● సీపీ సాయిచైతన్య

నిజామాబాద్‌అర్బన్‌: ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సీపీ సా యిచైతన్య పేర్కొన్నారు. శుక్రవారం తన కా ర్యాలయంలో పరీక్షల నిర్వహణపై సమావే శం నిర్వహించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఈ నెల 29న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని ని జామాబాద్‌ డివిజన్‌లో 20 కేంద్రాలు ఏర్పా టు చేశామని, 6,810 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జ రుగుతుందన్నారు. పరీక్షలకు రీజినల్‌ కోఆర్డి నేటర్‌గా గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రా మ్మోహన్‌, నోడల్‌ అధికారిగా డీసీపీ శుభం ప్రకాశ్‌ వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో

అంతరాయం

సుభాష్‌నగర్‌ : నగరంలోని పలు సబ్‌ స్టేషన్ల లో మరమ్మతుల కారణంగా శనివారం ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏ ర్పడుతుందని టౌన్‌–3 ఏడీఈ పీ.వినోద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక్‌నగర్‌, ఆర్యనగర్‌ సబ్‌ స్టేషన్లలో మరమ్మతులు చేపడుతున్నామని, దీంతో సరఫరాను నిలిపేస్తున్నామని పేర్కొన్నారు. విని యోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకొ ని విద్యుత్‌ శాఖకు సహకరించాలని కోరారు.

నేడు బీజేపీ మహాపాదయాత్ర

సన్నాహక సమావేశం

సుభాష్‌నగర్‌: ఈ నెల 23న నగరంలో నిర్వ హించనున్న మహా పాదయాత్రపై శనివారం సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసినట్లు బీ జేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌ నుంచి ఆర్‌ఆర్‌ చౌర స్తా వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. సభకు బీజేపీ జాతీయ అధ్యక్షు డు నితిన్‌ నబీన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాల యంలో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి ముఖ్య అతిథులు గా బీజేపీ శాసనసభ పక్షనేత, నిర్మల్‌ ఎమ్మె ల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కాంతారావు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement