వర్ని ప్రభుత్వాస్పత్రిలో షార్ట్‌ సర్క్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

వర్ని ప్రభుత్వాస్పత్రిలో షార్ట్‌ సర్క్యూట్‌

Nov 16 2026 12:44 AM | Updated on Nov 16 2026 12:44 AM

● అంధకారంలో ఆస్పత్రి

● పట్టించుకోని అధికారులు

వర్ని: మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన 30 పడకల ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌ చోటుచేసుకుంది. నాణ్యత లేని విద్యుత్‌ పరికరాలు బిగించడంతో నెల రోజుల్లోనే రెండుసార్లు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. తాజాగా ఆదివారం సాయంత్రం షార్ట్‌ సర్క్యూట్‌తో ఆస్పత్రిలో వైర్లు, ట్యూబ్‌ లైట్లు పూర్తిగా కాలిపోయాయి. ఆదివారం రాత్రి మొత్తం ఆస్పత్రి అంధకారంలో ఉంది. ఆస్పత్రి నిర్మించిన కాంట్రాక్టర్‌ నాసిరకమైన విద్యుత్‌ పరికరాలు వాడటం వల్లనే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 20 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఆస్పత్రిలో విద్యుత్‌ వ్యవస్థతో పాటు లిఫ్టు, ఆస్పత్రిలో మిగతా విభాగాలు, భవన నిర్మాణంలో నాణ్యత లోపించినట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు. నిర్మాణ సమయంలో ఆరోగ్యశాఖ విజిలెన్స్‌ అధికారులు, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యతా లోపంతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నిండు గర్భిణీ ఆస్పత్రికి వస్తే కరెంట్‌ సరఫరా లేకపోవడంతో నిజామాబాద్‌ ఆస్పత్రికి స్థానిక సిబ్బంది రిఫర్‌ చేశారు. ఆస్పత్రికి వచ్చిన ఏడుగురు అవుట్‌ పేషెంట్లకు ఫోన్‌ వెలుతురులో తాత్కాలిక చికిత్స నిర్వహించి పంపించారు. ఆస్పత్రి నిర్మించిన కాంట్రాక్టర్‌, ఆరోగ్య శాఖ విజిలెన్స్‌ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement