● కంకర వేసి రెండేళ్లు పూర్తి
కావస్తున్న వైనం
● పట్టించుకోని అధికార యంత్రాంగం
రెంజల్ : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మారింది మండలంలోని గిరిజన తండాల పరిస్థితి. గిరిజన తండాలకు బీటీ లింకు రోడ్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ కింద నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసినా ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్న చందంగా మా రింది. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు రెండు ఏళ్ల కిందట కంకర వేసి అలాగే వదిలి పెట్టడంతో రై తులు రాకపోకలను తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. బోధన్ నియోజకవర్గానికి.. కేంద్రం ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.14 కోట్లను మంజూరు చేసింది. అందులో నుంచి రెంజల్ మండలానికి తొమ్మిదిన్నర కోట్ల సింహభాగం నిధులను మంజూరు చేశారు. ప నులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు రెండేళ్ల కిందట కంకర వేసి వదిలేశారు. దీంతో పనులు ముందుకు సాగకపోవడంతో ఆయా గ్రామాల రైతులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు తమ శాఖ పరిధి కాదని తప్పించుకుంటున్నారు.
బీటీ నిర్మాణాలతో పాటు కల్వర్టుల నిర్మాణ పనుల ను నాసిరకంగా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కంకర వేసిన కాంట్రాక్టర్లు కల్వర్టు నిర్మాణ పనుల ను అక్కడక్కడా పూర్తి చేశారు. కల్వర్టు నిర్మాణ పను లను నాసిరకంగా చేపట్టడంతో పగుళ్లు ఏర్పడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ చేసి పనులను పూర్తి చేయించాలని రైతులు కోరుతున్నారు.
మండలంలోని గిరిజన తండాల రోడ్లను అనుసంధానం చేస్తూ వ్యవసాయ రోడ్లను బీటీగా మార్చేందుకు కేంద్ర ఎస్టీ సబ్ ప్లాన్ కింద నియోజకవర్గానికి నిధులను మంజూరు చేసింది. మండలంలోని బాగేపల్లి నుంచి తాడ్‌బిలోలి వరకు, వీరన్నగుట్ట తండా నుంచి తాడ్‌బిలోలి వరకు, సాటాపూర్ తండా నుంచి బాగేపల్లి, వీరన్నగుట్ట వరకు గల లింకు రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ కంకర వేసి వదిలి పెట్టడంతో ఆయా గ్రామాల నుంచి వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అధికారులను ఎవరిని అడిగినా తమ శాఖ పనులు కావంటున్నారు. రెండు సంవత్సనాలకు ముందు కాంట్రాక్టర్లు కంకర వేసి కల్వర్టులను నిర్మించి వదిలేశారు. మట్టి రోడ్లు బీటీగా మారుతున్నాయనే ఆనందం అధికారుల నిర్లక్ష్యంతో కరువైంది. అసలు పనలును ఏ శాఖ పర్యవేక్షణ చేస్తుందనేది స్పష్టత ఇవ్వాలి. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు మంజూరయ్యాయా లేక నిధులు లేవని పనులను వదిలేశారా అనేది అధికారులు చెప్పాలి. – సుమలత, సర్పంచ్ వీరన్నగుట్ట తండా


