బోధన్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూతన చైర్మన్ చిక్కెల లక్ష్మణ్, పాలక వర్గ సభ్యులు రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం సొసైటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొత్త పాలక వర్గ సభ్యులు రైతులకు మెరుగైన సేవలందించాలని కోరారు. సొసైటీ చైర్మన్ చిక్కెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. సహకార సంఘం ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సంఘ అభివృద్ధికి సహకరించాలని రైతులను కోరారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రైతులు, సభ్యులకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగం, నాయకులు పాల్గొన్నారు.


