కమ్మర్పల్లి(ఏర్గట్ల): రెండు రోజుల క్రితం జరిగిన క్రికెట్ అండర్–19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన యువకుడు రాజారాపు సతీష్ సరికొత్తగా తన దేశభక్తిని, క్రీడాభిమానాన్ని చాటుకున్నారు. తన చేతి వృత్తి నైపుణ్యంతో వెల్డింగ్ మెటీరియల్స్ ఉపయోగించి ఒక అద్భుతమైన క్రికెట్ ప్రతిమను రూపొందించారు. వికెట్ల ముందు బ్యాట్స్‌మెన్ షాట్ కొడుతున్నట్లుగా ఉన్న ఈ వెల్డింగ్ కళాఖండం అందరినీ ఆకట్టుకుంటోంది. భారత జట్టు సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా ఈ ట్రోఫీని తయారు చేసినట్లు సతీష్ తెలిపారు.


