ఆర్మూర్‌టౌన్:ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల ఆధార్ నమోదు కార్యాలయం, మార్కెండేయ మందిరం ఆవరణలో ఆదివారం ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఆదివా రం ఒక గంట నినాదంతో ప్రతి కాలనీలో కాలనీవాసులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. అ లాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావన్నారు.సంస్థ సభ్యులు బోడమీది ప్రశాంత్, ర మేశ్, సుంకే నిశాంత్, సుమన్, జంగిడి భోజన్న, రాహుల్ రాజ్, కృషివర్ధన్, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సభ్యుడిగా నియమితులైన ద్యాగ ఉదయ్‌ను ఆదిలాబాద్‌లో స్థానిక తరంగిణి ఫంక్షన్ హాల్లో ఆయన మిత్రులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమో ద్ కుమార్ ఖత్రి, ప్రముఖ రచయిత మురళీధర్, ఉదయ్ కుమార్, జీపీ పోరెడ్డి దయాకర్, జగదీశ్వర్, కొండా రాజు, శ్రీనివాస్, వెంకటరమణ, రాజన్న,జీవన్ తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పట్టణ కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్‌కుమార్ ఆదివారం సన్మానించారు. మోర్తాడ్ ప్రజానిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ ఉపా ధ్యక్షులు మీసాల నవీన్, నాగభూషణం, సాయిబాబా, ప్రధాన కార్యదర్శులు చంద్రం, కాపు కుమ్మరి హరీష్, మహిళా కార్యదర్శి నల్లూరి గంగామణి, సిర్పూ కళ్యాణ్, నాగేష్, రఫిక్ దుబాయ్, బార్ల మోహన్ తదితరులను ఘనంగా సన్మానించారు.
వేల్పూర్: వేల్పూర్ మండలం మోతె విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రలో భాగంగా ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. చదువుతో పాటు ఆధ్యాత్మిక భావాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, నైతిక విలువలు, క్రమశిక్షణ వంటి అంశాలను విద్యార్థులకు ప్ర త్యక్ష అనుభవం ద్వారా పరిచయం చేయడమే యాత్ర ముఖ్య ఉద్ధేశ్యమని పాఠశాల ప్రిన్సిపాల్ జువ్వి హరీష్ పేర్కొన్నారు. యాదాద్రితో పాటు స్వర్ణగిరి, కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు వెల్లడించారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై గల శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ఆలయ పరిసర ప్రాంతా ల్లో పల్లకీసేవ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


