ప్రభుత్వ సలహాదారును కలిసిన సొసైటీ పాలకవర్గం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సలహాదారును కలిసిన సొసైటీ పాలకవర్గం

Oct 22 2026 4:08 AM | Updated on Oct 22 2026 4:08 AM

నిత్యావసర సరుకులు.. పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు..

నవీపేట: నవీపేట సొసైటీ నూతన పాలకవర్గం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డిని బుధవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. స్థానిక సమస్యలతో పాటు రైతుల సమస్యలను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్‌ మోస్రా సాయరెడ్డి, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు

బాధిత కుటుంబానికి

ఆర్థిక సహాయం

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ మండలం బడాభీమ్‌గల్‌ గ్రామానికి చెందిన దుమాల సుజాత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆమె కుటుంబ సభ్యులను మాజీ ఎ మ్మెల్యే ఈరవత్రి అనిల్‌కుమార్‌ బుధవారం ప రామర్శించారు. రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్‌ నాయకులు సురేందర్‌, నాగేందర్‌ తదితరులు ఉన్నారు.

రుద్రూర్‌: అంబం(ఆర్‌) గ్రామంలో కీ.శే. ఇందూరు జగనన్‌మోహన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మంగళవారం 10 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జగనన్‌మోహన్‌ కుమారులు ఇందూరు శ్రీధర్‌, శ్రీకాంత్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు శ్రీధర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథా న్ని అలవర్చుకొని, పేదలకు తమవంతు సహా యం అందించాలని అన్నారు. ట్రస్ట్‌ సభ్యులు గగనన్‌ యాదవ్‌, గౌతమ్‌, తాహెర్‌పాల్గొన్నారు.

వేల్పూర్‌: అంక్సాపూర్‌లో దసరా పండుగను పురస్కరించుకొని జీపీ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను సర్పంచ్‌ తీట్ల శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ నేరెళ్ల చిన్న రాజేశ్వర్‌ మంగళవారం అందజేశారు. వార్డు సభ్యులు ఆర్మూర్‌ మోహనన్‌, బుట్టి మధు, బబ్బూర్‌ శీను, తీట్ల విజయ్‌కుమార్‌, తీట్ల సంతోష్‌, బుట్టి మౌనిక, చెడిమెల భువన, బుట్టి నర్సాబాయి, మచ్చనర్సు, తీట్ల హరిప్రియ, జీపీ కార్యదర్శి రవికుమార్‌, కారోబార్‌ చిట్టిబాబు గ్రామస్తులు పాల్గొన్నారు.

బాన్సువాడ సెగ్మెంట్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా షేక్‌ మతిన్‌్‌

రుద్రూర్‌: రాయకూర్‌ క్యాంపు గ్రామానికి చెందిన షేక్‌ మతిన్‌కు తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌)లో కీలక బాధ్యతలు అప్పగించారు. బా న్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆయనను నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వ కుంట్ల కవిత ప్రకటించారని బుధవారం ఈ విషయాన్ని షేక్‌ మతీన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధినేత్రి కవితకు కృతజ్ఞతలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన

మాందాపూర్‌ గ్రామస్తులు

మాక్లూర్‌: మాందాపూర్‌ గ్రామంలో నిర్మించతలపెట్టిన రామాలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రూ.40 లక్షలు మంజూరైనప్పటికి అధికారిక మంజూరు పత్రం రాకపోవటంతో వీడీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కలిశారు. బుధవారం జనవికాస సేవా సమితి జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి ఆధ్వర్యంలో నవీపేట మండలం జన్నేపల్లిలోని గెస్ట్‌ హౌస్‌లో ఉ న్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావును వీడీసీ సభ్యులందరు కలిసి సమస్యను విన్నవించారు. స్పందించిన మైనంపల్లి మాందాపూర్‌లో కొత్తగా నిర్మించే రామాలయా నికి దేవాదాయ శాఖ నుంచి రూ. 40 లక్షలు మంజూరైనప్పటికి ఇప్పటి వరకు అధికారికంగా నిధుల మంజూరు పత్రం తమకు అందలేదని తెలిపారు. స్పందించిన మాజీ ఎమ్మెల్యే వెంటనే దేవాదయశాఖ రాష్ట్ర కమిషనర్‌కు ఫోన్‌ చేసి జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు కూడా స్పందించి త్వరలో నిధుల మంజూరుకు సంబంధించి మంజూరు పత్రాన్ని త్వరలో చేరవేస్తామని వెల్లడించటంతో వీడీసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement