అందరినీ ఏకం చేసేవి పండుగలు | - | Sakshi
Sakshi News home page

అందరినీ ఏకం చేసేవి పండుగలు

Oct 22 2026 4:08 AM | Updated on Oct 22 2026 4:08 AM

పెర్కిట్‌(ఆర్మూర్‌): పండుగలు ఆత్మీయులందరినీ ఏకం చేస్తాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో బుధవారం నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధర్మం ఉన్న చోట విజయం ఉంటుందనే సందేశం విజయదశమి పండుగ ద్వారా తెలుస్తుందన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలతో పాటు దసర వేడుకలు ఆర్మూర్‌ ప్రాంతంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, సర్పంచ్‌ అంక్సాపురం దేవేందర్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు మార చంద్రమోహన్‌ రెడ్డి, మార గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నివాసంలో ..

వేల్పూర్‌: మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమం సందడిగా సాగింది. జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులు, బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామప్రజలు, నాయకులు, కార్యకర్తల మధ్య పండుగ జరుపుకోవడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement