ఎల్‌నినో వేళ.. అప్రమత్తం! | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో వేళ.. అప్రమత్తం!

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎల్‌నినో ప్రభావంతో రాను న్న రోజుల్లో గ్రామాల్లో తాగునీటి ఎద్దటి తలెత్తకుండా గ్రామ పంచాయతీలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూ సేందుకు జిల్లా అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులైన్‌ల లీకేజీల కారణంగా నీరు వృథా కాకుండా చూ డాలని, ఇంటింటికీ తాగునీరు అందించడంతో పాటు సౌకర్యం లేని ఇళ్లకు నల్లా కనెక్షన్‌లు ఇవ్వాల ని ఆదేశాలిచ్చారు. ఇటు ‘మిషన్‌ భగీరథ’ పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ ఇటీవల నూతన మార్గదర్శకాలు ఇచ్చారు.

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

ఎల్‌నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పైపులైన్ల లీకేజీలు, మోటార్ల మరమ్మతులు చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం. నీటి వృథాను అరికట్టే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాం.

– శ్రీనివాస్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి

గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు

రాకుండా యాక్షన్‌ ప్లాన్‌

నీటి వృథాను అరికట్టేందుకు

లీకేజీలపై దృష్టి

‘మిషన్‌ భగీరథ’పై గ్రామ

పంచాయతీలకు బాధ్యతలు

ఎండిపోతున్న బోర్లకు ఫ్లషింగ్‌,

డీపెనింగ్‌కు అధికారుల ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement