కల్వకుంట్ల కుటుంబం కోసమే ‘కాళేశ్వరం’ రీ డిజైన్‌ | - | Sakshi
Sakshi News home page

కల్వకుంట్ల కుటుంబం కోసమే ‘కాళేశ్వరం’ రీ డిజైన్‌

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

● సర్కారు తీరుతోనే సాగునీటి ఇబ్బందులు

● ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

సుభాష్‌నగర్‌: యాసంగిలో పంటలు సాగు చేయొ ద్దని ప్రభుత్వం చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే మొదట ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం అందించి క్రాప్‌ హాలీడే ప్రకటించాల ని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ గురువారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజ్‌ల పనులు నాసిరకంగా చే పట్టడంతో కుంగిపోయాయని, మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రాజెక్టుల్లో సాగునీరు లేక ఎల్‌నినో ప్రభావానికి రైతాంగం గురికావడానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్సే కారణమయ్యాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రీడిజైన్‌ కల్వకుంట్ల కుటుంబ స్వలా భం కోసమే చేశారన్నారు. గత ప్రభుత్వం బ్యారేజ్‌ పనులను నాసిరకంగా చేయగా.. ప్రస్తుత ప్రభు త్వం సాగునీటి రంగాన్ని విస్మరించడంతో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా అయ్యిందని పేర్కొన్నారు. బ్యారేజ్‌లకు మరమ్మతులు చేపడితే కొంతవరకై నా ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేవాళ్లమని ఎంపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే పసుపు ధర క్వింటాల్‌కు రూ.50 వేలు వచ్చేలా చేసి చూపిస్తామన్నారు.

ఆర్వోబీలు..

మాధవనగర్‌ ఆర్‌వోబీ డిజైన్‌ మారిందని, అదనపు అంచనా వ్యయంతో కూడిన ఫైల్‌ ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉందన్నారు. ఈ పనులను బీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం తీవ్రంగా జాప్యం చేసిందని, కాంగ్రెస్‌ ప్ర భుత్వం సైతం అదే తోవలో నడుస్తోందని విమర్శించారు. త్వరలోనే దీనిపై ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. పసుపు బోర్డు తర్వాత తాను అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్ట్‌ మాధవనగర్‌ ఆర్‌ఓబీ అని గుర్తుచేశారు. బోధన్‌లో ఒక్క ఆర్‌వోబీ కూడా ముందుకు సాగడం లేదన్నారు.

మోసం కేటీఆర్‌ డీఎన్‌ఏలోనే ఉంది

మోసం చేయడం కేటీఆర్‌ డీఎన్‌ఏలో, వ్యక్తిత్వంలోనే ఉందని ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. సీజేపీ, ఇతర పార్టీలకు కేటీఆర్‌ మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు గద్దె భూమన్న, న్యాలం రాజు, మల్లేశ్‌యాదవ్‌, వనిత, కార్పొరేటర్లు ప్రమోద్‌కుమార్‌, నాగోళ్ల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement