10 టీఎంసీలు తగ్గిన ఎస్సారెస్పీ నీటిమట్టం | - | Sakshi
Sakshi News home page

10 టీఎంసీలు తగ్గిన ఎస్సారెస్పీ నీటిమట్టం

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

వేల్పూర్‌(మెండోరా): శ్రీరాంసాగర్‌ నీటిమట్టం రెండు వారాల్లో పది టీఎంసీలు తగ్గింది. ఎగువ నుంచి వచ్చిన వరద, స్థానికంగా కురిసన వర్షాల కారణంగా ఈ ఏడాది ప్రాజెక్టు నీటి మట్టం 46 టీఎంసీలకు చేరింది. పంటల కోసం కాకతీయ, సరస్వతి, లక్ష్మి, వరదకాలువలకు, అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం వేగంగా తగ్గిపోయింది. అలాగే తాగునీటి అవసరాల కోసం నిరంతరం మిషన్‌ భగీరథ పథకానికి నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ఈనెల 7వ తేదీ వరకు 46 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి విడుదల కారణంగా గురువారం నాటికి 36 టీఎంసీలకు తగ్గింది.

నిజాంసాగర్‌ నీటి విడుదల నిలిపివేత

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు గురువారం నీటి విడుదలను నిలిపివేసినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల అవసరాల కోసం మూడో విడత నీటి విడుదల పూర్తయ్యిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1,398.54 అడుగుల(9.857 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.

‘చెరుకు టన్నుకు

రూ. 350 బోనస్‌ ఇస్తాం’

నిజాంసాగర్‌: వచ్చే క్రషింగ్‌ సీజన్‌నుంచి రైతులకు టన్ను చెరుకుకు రూ. 350 ప్రోత్సాహకాన్ని అందిస్తామని గాయత్రి షుగర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.సరితరెడ్డి పేర్కొన్నారు. గురువారం మాగిలోని గాయత్రి షుగర్స్‌ కర్మాగారంలో బాయిలర్‌ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం చెరు కు టన్ను ధర 3,917 ఉందన్నారు. గాయత్రి కర్మాగారం పరిధిలో 10,700 ఎకరాల్లో పంట సాగయ్యిందని, ఈ క్రషింగ్‌ సీజన్‌లో 4.25 లక్షల మెట్రిక్‌ టన్నుల క్రషింగ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. చెరుకు నరికేందుకు 90 ముఠాలు, 28 చెరుకు నరికే యంత్రాలు, 150 లారీలను సి ద్ధం చేశామన్నారు. పంటను గాయత్రి కర్మాగారానికి తరలించి యాజమాన్యానికి సహకరించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ వైస్‌ చైర్మన్లు టి.సందీప్‌రెడ్డి, వేణుగోపాల్‌ రావు, ప్రెసిడెంట్‌ శంకర్‌రావు, జనరల్‌ మేనేజర్‌ వెంగళ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో

సభ్యత్వ నమోదు

నిజామాబాద్‌ రూరల్‌: మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు ప్రారంభమైందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండ దే వన్న పిలుపునిచ్చారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో భాగ స్వాములై సభ్యత్వం పొందాలని కోరారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆనన్‌లైన్‌న్‌ విధానం అందుబాటులో ఉందన్నారు. సమావేశంలో ఆకుల శ్రీశైలం, గాండ్ల లింగం, రంగు సీతారాం, వకీల్‌ ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement