దేవి వేషధారణ పోటీలు | - | Sakshi
Sakshi News home page

దేవి వేషధారణ పోటీలు

Oct 22 2026 4:08 AM | Updated on Oct 22 2026 4:08 AM

నియామకం

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని రాంనగర్‌ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రీక్జూ యూత్‌ ఆధ్వర్యంలో దేవీ వేషధారణలో ఉన్న పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆర్మూర్‌ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్‌, ఆయన తల్లి పట్వారి బాల సరస్వతి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మండపాల నిర్వహకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

గోశాలలో క్రీడాపోటీలు

రుద్రూర్‌: దసరా పండుగను పురస్కరించుకొని అంబంలోని శ్రీ ఆంజనేయ గోశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు ప్రదానం చేశారు. షటిల్‌ బ్యాడ్మింటన్‌, క్యారమ్స్‌, మ్యూజికల్‌ చైర్‌, స్కిప్పింగ్‌, డస్టర్‌ గేమ్స్‌ తదితర పోటీలు నిర్వహించారు. దేవి శోభాయాత్రకు ముందు పిల్లలు, యువకులకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులు, యువకులు ఉత్సాహంగా తమ ప్రతిభను చాటారు. పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలు గ్రామంలో సందడి నెలకొల్పాయి.

సిరికొండ: కాంగ్రెస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా రావుట్ల గ్రామానికి చెందిన వోరగంటి రాజ్‌కుమార్‌ నియామకమయ్యారు. ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, సీనియర్‌ నాయకులు బాజన్నగారి రమేష్‌, సామేల్‌, కనగందుల లింగం, ప్యాట్ల దాసు, అనిల్‌, భార్గవ్‌, సుమంత్‌, అభి, దాసు, గంగారెడ్డి, లాజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement