నూత్‌పల్లి జాతరకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

నూత్‌పల్లి జాతరకు వేళాయె..

Oct 22 2026 4:08 AM | Updated on Oct 22 2026 4:08 AM

● ఈ నెల 25 నుంచి ఐదు రోజుల

పాటు ఉత్సవాలు

● భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న

ఆలయ కమిటీ

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మండల పరిధిలోని నూత్‌పల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 25 నుంచి 29 వరకు ఐదు రోజుల పాటు ఈ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలకు ఈసారి కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ కమిటీ స భ్యులు, గ్రామస్తులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తు న్నారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 25న స్వామి వారి ఊరేగింపు, కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 26న భక్తుల సమర్పణల నడుమ అమ్మవారి బోనాల ఉత్సవం జరుగుతుంది. 27న అన్నప్రసాద వితరణ, రాత్రికి కనులపండువగా శ్రీ స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 28న స్వామి వారికి ప్రత్యేక నైవేద్యాల సమర్పణ, సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగనున్నాయి. 29న స్వామివారి నాగవెల్లి, వైభవంగా పల్లకిసేవ కార్యక్రమాలతో ఈ ఐదు రోజుల జాతర మహోత్సవాలు ముగుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement