బోధన్: ఎడపల్లి మండల కేంద్రంలోనీ వీరహనుమాన్ మందిరం వద్ద గల ధర్మశాల పునర్నిర్మాణానికి బుధవారం ఉపసర్పంచ్, ధర్మశాల పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు మచ్కూరి గంగాధర్ ఆధ్వర్యంలో సర్పంచ్ కందగట్ల రాంచందర్, సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి ,గ్రామ పెద్దలు, నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. ధర్మాశాల పునర్నిర్మాణానికి రూ.14 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామస్తులు, యువకులు విరాళాలు అందించారని ప్రజాప్రతినిధులు తెలిపారు. నాయకులు శంకర్ నాయుడు, మోహన్‌రెడ్డి, బంజ కామప్ప, యోగేశ్ దేశ్‌ముఖ్, కరణం శంకర్‌రావు, బొబ్బిలి శ్రీనివాస్, నాగేశ్వర్, బి.గణేశ్, తదితరులు పాల్గొన్నారు.


