ఇందూరులో విశిష్ట గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇందూరులో విశిష్ట గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూం ప్రారంభం

Oct 19 2026 1:43 AM | Updated on Oct 19 2026 1:43 AM

నిజామాబాద్‌ రూరల్‌: ఇందూరులో టీఆర్‌పీ విశిష్ట గోల్‌ అండ్‌ డైమండ్‌ షోరూమ్‌ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. సినీ నటి నిధి అగర్వాల్‌ రిబ్బన్‌ కట్‌ చేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం షోరూం అంతా కలియతిరుగుతూ షోరూంలో ఉన్న బంగారు నగలు, వజ్రాలను పరిశీలించారు. అదిరిపోయే ఆఫర్లు ఉండటంతో పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వచ్చారు. దీంతో షోరూమ్‌ సందడిగా మారింది. పండుగలు, వివాహాలకు లభించే అన్ని రకాల నగలు, వజ్రాలు విశిష్ట గోల్‌ అండ్‌ డైమండ్‌ షోరూమ్‌లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. జిల్లా కేంద్రంలో విశిష్ట జ్యువెలరీ ఏర్పాటు కావడం ఎంతో ఆనందదాయకమన్నారు. వంద గ్రాముల బంగారు ఆభరణాల కొనుగోలుపై బంగారు, వెండి నాణాలను ఉచితంగా పొందవచ్చని అన్నారు. షోరూమ్‌ బయట ఏర్పాటు చేసిన వేదికపై ప్రేక్షకులతో మాట్లాడి నృత్యం చేశారు. షోరూంలో దసరా, దీపావళి, సంక్రాంతి కొనుగోలు అధికంగా జరపాలని ప్రజలను కోరారు. సినీనటి నిధి అగర్వాల్‌ను చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిధి అగర్వాల్‌ సైతం అభిమానులను పలకరిస్తూ, చేతులు ఊపుతూ సందడి చేశారు. అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులకు విశిష్ట గోల్డ్‌, డైమండ్‌ షోరూం అందుబాటులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ ఉమారాణి, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, షోరూమ్‌ యజమానులు ఆనంద్‌బాబు పాలబట్ల, తొడుపునూరి శ్రీనివాస్‌, సుమంత్‌, కార్పొరేటర్‌ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement