కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన పొలాస సుధాకర్ (60) కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందింది. స్థానిక తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుధాకర్ సతీమణి సరోజ, కుమారుడు శ్రీనివాస్‌కు ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠిల ఆదివారం రూ.5 లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబాని కి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. అదనపు కలెక్టర్ భు జంగరావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మున్సిపల్ చైర్పర్సన్ బొదిరే నాగమణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తహసీల్దార్ కిరణ్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు మామరి సందీప్, నాయకులు బొదిరే స్వామి, పర్స అనంతరావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ సర్కిల్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పిల్లి మహిపాల్ ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో ప్రతిభ కనబరిచి మెడల్ సాధించారు. ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియంలో వేదాంత ఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వ హించిన 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌ను 2 గంటల 12 నిమిషాల్లో పూర్తిచేసి మెడల్ సాధించినట్లు మహిపాల్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సుమారు 41 వేలమంది క్రీడాకారులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలిగా రాణి
ఆర్మూర్ : పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అ ధ్యక్షురాలిగా ఆర్మూర్ పట్టణానికి చెందిన పీ రాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రాహ్మణపల్లి జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న రాణి.. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాని కి నిరంతరం కషి చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నా రు. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్ప గించిన సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నా యకులకు, సహచర ఉపాధ్యాయులకు రాణి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


