వరి సాగు చేసి ఇబ్బందులు పడొద్దు | - | Sakshi
Sakshi News home page

వరి సాగు చేసి ఇబ్బందులు పడొద్దు

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

● తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత

● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక జలాశయాల్లో నీటి నిల్వలు చేరలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. భీమ్‌గల్‌ తహసీల్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు సైతం గణనీయంగా పడిపోతున్నాయని, మున్మందు పంటల సాగుకు సరిపడా విద్యుత్‌ సరఫరా చేసేందుకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సమృద్ధిగా సాగు జలాలు అందించామని, పూర్తి స్థాయిలో కరెంటు సరఫరా చేసి పంటలను కాపాడుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుత యాసంగిలో వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తక్కువ నీటితో సాగయ్యే కూరగాయలు, పప్పు దినుసుల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ భుజంగరావు, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నాగమణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, తహసీల్దార్‌ కిరణ్‌, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement