తీరొక్క పూల పరిమళం | - | Sakshi
Sakshi News home page

తీరొక్క పూల పరిమళం

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

న్యూస్‌రీల్‌

● ఘనంగా సద్దుల సంబురం ● ఆడిపాడిన ఆడబిడ్డలు ● అంబరాన్నంటిన బతుకమ్మ వేడుక

సోమవారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

నగర శివారులోని బోర్గాం(పీ)లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు, యువతులు

బోర్గాం(పీ)లో బతుకమ్మలతో

ఊరేగింపుగా వెళ్తున్న ఆడపడుచులు

‘‘చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ..’’ అంటూ బతుకమ్మను తమ ఆటపాటలతో ఆడబిడ్డలు భక్తితో కొలిచారు.

ఇందూరు గడ్డ తీరొక్క పూలతో పరిమళించింది. జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌ నగరంతోపాటు ఆయా ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు, కంఠేశ్వర్‌, హమాల్‌వాడి సాయిబాబా ఆలయాలతోపాటు పూలాంగ్‌, న్యూ హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, ఎల్లమ్మగుట్ట, బాలహనుమాన్‌

ఆలయాల వద్ద గౌరమ్మను భక్తితో కొలిచి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడారు. రఘునాథ చెరువు వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. సీపీ సాయిచైతన్య, ఏసీపీ ప్రకాశ్‌ యాదవ్‌ సిబ్బందితో కలిసి బందోబస్తును పర్యవేక్షించారు. – నిజామాబాద్‌ రూరల్‌/నిజామాబాద్‌ అర్బన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement