భారీ నగదు, ప్రామిసరీ పత్రాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

భారీ నగదు, ప్రామిసరీ పత్రాలు స్వాధీనం

Oct 19 2026 1:43 AM | Updated on Oct 19 2026 1:43 AM

రుద్రూర్‌: కోటగిరి ఉమ్మడి మండలంలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝళిపించారు. శనివారం ఉదయం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సుమారు పది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ మెరుపు దాడిలో రూ.74లక్షల50 వేల భారీ నగదుతో పాటు, పలు కీలక ప్రామిసరీ, అగ్రిమెంట్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు వడ్డీ వ్యాపారానికి సంబంధించిన పలు ప్రామిసరీ, రికార్డులు బయటపడటంతో వాటిని సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న నగదు, ప్రామిసరీ నోట్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదివారం తెలిపారు. చీటింగ్‌, మనీ ల్యాండింగ్‌ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement