● చెరువులో పడి ఒకరి మృతి
భిక్కనూరు: సద్దుల బతుకమ్మ సంబురాల్లో అపశృతి చోటు చేసుకుంది. భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో ఆదివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అనంతరం పలుగు చెరువు వద్ద గ్రామానికి చెందిన ధర్మగళ్ల స్వామి(45) బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు లోనికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. గమనించిన గ్రామస్తులు చెరువులోకి దూకి స్వామిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే స్వామి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. బతుకమ్మ పండుగ పూట ఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


