క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Oct 19 2026 1:43 AM | Updated on Oct 19 2026 1:43 AM

అనారోగ్య సమస్యలతో హోమ్‌గార్డు మృతి రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు యువకుడి అదృశ్యం

కామారెడ్డి టౌన్‌: పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు షేక్‌ చోటు(35) అనా రోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఫిట్స్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం విధుల్లో ఉన్న అతనికి ఫిట్స్‌ రావడంతో తోటి సిబ్బంది, కుటుంబీకులు నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి మెరుగైన చికిత్సకోసం తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. షేక్‌ చోటుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతిపై పట్టణ సీఐ, ఎస్సైలు, పోలీస్‌ అధికారులు, తోటి హోంగార్డులు సంతాపం వ్యక్తం చేశారు.

నస్రుల్లాబాద్‌: మండలంలోని కామిశెట్టి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం బస్సును వెనుక నుంచి బైక్‌ ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. బోధన్‌ నుంచి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కామిశెట్టిపల్లి వద్ద ప్రయాణికులను దింపడానికి అకస్మాతుగా ఆపడంతో వెనుకాలే బైక్‌పై వస్తున్న మహమ్మద్‌నగర్‌కు చెందిన చింతల కాశీరాం, చింతల సాయవ్వ ఢీకొన్నారు. ప్రమాదంలో కాశీరాంకు చేయి, కాలు విరిగింది. సాయవ్వకు పల్లు విరిగి పోయి తీవ్ర రక్త స్రావమైంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రుద్రూర్‌: మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన టాక్లి శ్రీకర్‌ (20) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై మనోజ్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. బోధన్‌లోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్న శ్రీకర్‌ శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement