జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన సైదు వరుణ్ తేజ్, సైదు అయాన్ తెలంగాణ సైనిక్ స్కూల్ (రుక్మాపూర్)కు ఎంపికయ్యారు. దీంతో వరుణ్ తేజ్, అయాన్లను ఉప సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, గ్రామాభివద్ధి కమిటీ సభ్యులు ఆదివారం సన్మానించారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సైదు లక్ష్మణ్, డాక్టర్ లక్ష్మణ్, గ్రామ కమిటీ చైర్మన్ అంకం రాజేందర్, సభ్యులు భూమారెడ్డి, శ్రీనివాస్, మల్లయ్య, గంగారాం, బోజేందర్, నర్సయ్య, నాయకులు రాజేశ్వర్ గౌడ్, మేకల అశోక్, సాయన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


