ప్రయాణం పది గంటలు ఆలస్యం.. | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం పది గంటలు ఆలస్యం..

Oct 19 2026 2:07 AM | Updated on Oct 19 2026 2:07 AM

● దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో

ప్రయాణికుల ఇబ్బందులు

నిజామాబాద్‌అర్బన్‌: ముంబై–లింగంపల్లి (దేవగిరి ఎక్స్‌ప్రెస్‌–17057) రైలు దాదాపు 10 గంటల ఆలస్యంతో ప్రయాణికులు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం రాత్రి 9.30 గంటలకు సీఎస్‌ఎంటీ(ముంబై) నుంచి బయల్దేరిన దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను మహారాష్ట్రలో చేపడుతున్న రైల్వే పనుల కారణంగా అంబర్‌నాథ్‌, బద్లాపూర్‌, లోనావాలా, పూణే మీదుగా మళ్లించారు. ఉదయం 11.30 గంటలకు నిజామాబాద్‌కు చేరుకోవాల్సిన ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 9.32 గంటలకు వచ్చింది. రైలు రూట్‌ మళ్లింపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, బతుకమ్మ పండగకు సకాలంలో ఇళ్లకు చేరుకోలేకపోయామని పలు వురు ప్రయాణికులు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement