గడువు ముగిసినా.. | - | Sakshi
Sakshi News home page

గడువు ముగిసినా..

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

కొనసాగుతున్న కల్లు డిపో

● మూడో కల్లు డిపోపై కన్నెత్తి చూడని

ఎకై ్సజ్‌ శాఖ

● మళ్లీ మామూళ్ల ఆరోపణలు

నిజామాబాద్‌అర్బన్‌: నిర్వహణ గడువు ముగిసినా కల్లు డిపోపై ఎకై ్సజ్‌శాఖ అధికారులు పట్టింపు లేని వైఖరిని అవలంభిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా డిపో కొనసాగుతుండడం, నిబంధనల అమలుపై అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం గడువు ముగియకుండానే రెన్యువల్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సెప్టెంబర్‌ 30తో..

జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న మూడో కల్లు డిపో నిర్వహణ గడువు సెప్టెంబర్‌ 30తో ముగిసింది. అనంతరం ఈ నెల 1న రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉండగా కానీ ఇప్పటి వరకు కాలేదు. జిల్లాలోని మిగతా కల్లు డిపోలకు రెన్యువల్‌ ముగిసింది. నూతన అనుమతితో ప్రారంభమయ్యాయి కానీ ఇక్కడ ఇదే కల్లు డిపో అనుమతి లేకుండా కొనసాగడంపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కల్లు డిపో గతేడాది సెప్టెంబర్‌ 30వ తేదీన గడువు ముగిసిన తర్వాత ప్రారంభ అనుమతులు రాకుండా కొనసాగింది. దీంతో అప్పటి ఎకై ్సజ్‌ అధికారులు ఈ డిపోను సీజ్‌ చేశారు. కానీ ప్రస్తుతం 16 రోజులు గడుస్తున్నా ఈ కల్లు డిపో వైపు ఎకై ్సజ్‌ అధికారులు కన్నెతి చూడడం లేదు. కొందరు ఎకై ్సజ్‌ అధికారులు మళ్లీ మామూళ్ల వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏసీబీ దాడి జరిగిన తర్వాత అధికారులు, సిబ్బంది కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి, ప్రస్తుతం మళ్లీ క్షేత్రస్థాయి నుంచి వసూళ్ల వ్యవహారం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జిల్లాకు వచ్చిన ఓ ఎకై ్సజ్‌ ఎస్సై కల్లు డిపోల నుంచి రెన్యువల్‌ అనుమతులు పొడిగిస్తానని చెప్పి వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. తీరా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విఫలమయ్యాడు. వచ్చి రాగానే వసూలు చేపట్టి కల్లు డిపో నిర్వాహకులను భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రస్తుతం కూడా కొందరు అధికారులు కల్లు డిపోలకు అనుమతుల నిర్వహణలో మామూళ్లకు అలవాటు పడి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement