బోసిపోతున్న టెక్స్‌టైల్స్‌ | - | Sakshi
Sakshi News home page

బోసిపోతున్న టెక్స్‌టైల్స్‌

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

నిజామాబాద్‌ రూరల్‌: కొనుగోలుదారులతో ఒకప్పుడు కిటకిటలాడిన టెక్స్‌టైల్స్‌ దుకాణాలు వస్త్ర షోరూమ్‌ల రాకతో బోసిపోయాయి. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలతోపాటు శుభకార్యలకూ స్థానిక టెక్స్‌టైల్స్‌ వ్యాపారుల వద్ద దుస్తులు కొనుగోలు చేసి డబ్బులు తమ చేతిలో ఉన్నప్పుడు చెల్లించే వారు. నాడు వ్యాపారులకు, కొనుగోలుదారులకు ఒకరిపై ఒకరికి న మ్మకం ఉండడంతో అటు వ్యాపారం సాగడంతోపాటు ఇటు ప్రజల అవసరం తీరేది. కానీ జిల్లా కేంద్రంతోపాటు ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ రావడంతో టెక్స్‌టైల్స్‌ మూతపడుతున్నాయి. కొందరు ప్రత్యామ్నాయం లేక వ్యాపారం కొనసాగిస్తూ అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు పోటీని తట్టుకోలేక దుకాణాలు మూసివేసి షాపింగ్‌ మాల్స్‌లో పని చేస్తున్నారు.

లక్షల విలువైన సరుకు పెట్టాం

పండుగల కోసం రూ.3 లక్షల డ్రెస్‌ మెటీరియల్‌ తీసుకువచ్చాం. కా నీ గిరాకీ లేదు. కనీసం కి రాయి కట్టే పరిస్థితి లేదు. గతంలో ప్రతి పండుగకు దుకాణం కొనుగోలుదారులతో కళకళలాడేది. ఇప్పుడు దుకాణాలు మూసేసి షోరూముల్లో జీతాలు ఉంటున్నారు. – బొడ్డు లక్ష్మీనర్సయ్య,

లక్ష్మీనర్సింహ ఫ్యాబ్రిక్స్‌, డిచ్‌పల్లి

కిరాయిలకు సరిపోతలేం

గిరాకీ కోసం చూస్తూ ఉండగానే నెలవస్తోంది. కిరాయిలు కట్టలేకపోతున్నాం. గతంలో కన్నా గ్రామీణ, మండల ప్రాంతాల్లో బట్ట ల దుకానాల్లో గిరాకీలు చాలా వరకు తగ్గిపోయింది. అందరూ షోరూంల బాట పడుతున్నారు. మేమే ప్రత్యామ్నాయం చూసుకోవాలి. – బిల్లా లింబాద్రి,

బట్టల వ్యాపారి, నిజామాబాద్‌

వస్త్ర షోరూమ్‌ల దెబ్బకు

గిరాకీ లేక విలవిల

మూతపడుతున్న దుకాణాలు

కార్పొరేట్‌ మాల్స్‌లో జీతానికి

వ్యాపారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement