ఇందూరు గడ్డపై
సద్దుల సంబురానికి ఇందూరు గడ్డ ముస్తాబైంది. ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడనున్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంతోపాటు ఆయా ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించనున్నారు. సద్దుల సంబురాలతో నగరంలోని వీధులు, కాలనీలు, కూడళ్లు పూలవనాలను తలపించనున్నాయి. జిల్లా కేంద్రంలో పూల వ్యాపారం జోరందుకుంది. ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, రహదారుల వెంట పూల దుకాణాలు కొలువుదీరాయి. బంతి, చామంతి, తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల పూలతోపాటు వివిధ రకాల రంగురంగుల పూలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. పండుగ కోసం మహిళలు పెద్దఎత్తున పూలను కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లలో సందడి నెలకొంది. వ్యాపారులు సైతం వివిధ ప్రాంతాల నుంచి పూలను తెప్పించి విక్రయిస్తున్నారు. మార్కెట్ పండుగ శోభను సంతరించుకుంది. – నిజామాబాద్ రూరల్
మార్కెట్లో
గునుగు, తంగేడు పూలు


