నిజామాబాద్అర్బన్: రెజ్లింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభకనబరిచారు. 70వ రాష్ట్ర స్థాయి అండర్ – 17 బాలుర, బాలికల రెజ్లింగ్ పోటీలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించగా.. జిల్లాకు చెందిన క్రీడాకారులు రెండు బంగారు, రెండు వెండి, ఆరు కాంస్య పతకాలు సాధించినట్లు ఎస్జీఎఫ్ సెక్రెటరీ అలివేణిమంగ తెలిపారు. ఓవరాల్ చాంపియన్ షిప్లో బాలురు మూడో స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారని, వెంకటేశ్, రిజ్వాన్ జాతీయ స్థాయి పోటీల్లొ పాల్గొంటారన్నారు.
జాతీయస్థాయికి ఎంపిక
అండర్–17 బాలుర, బాలికల రగ్బీ రాష్ట్రస్థాయి పోటీలు హైదరాబాద్లోని సరూర్నగర్లో నిర్వహించగా.. జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని అలివేణి మంగ తెలిపారు. నవ్య (జెడ్పీహెచ్ఎస్, సిరికొండ), ప్రయణ్ తేజ్ (జెడ్పీహెచ్ఎస్, మోపాల్) జాతీయస్థాయికి ఎంపికయ్యారన్నారు.
హ్యాండ్బాల్లో మూడో స్థానం
మహబూబ్నగర్లో నిర్వహించిన అండర్– 14 బాలికల హ్యాండ్ బాల్పోటీల్లో జిల్లా మూడో స్థానంలో నిలిచినట్లు అలివేణి మంగ తెలిపారు.


