జలాశయాల్లోని నీరు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు ఇతర జలాశయాల్లో ఉన్న నీటిని తాగు అవసరాలకే ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ నిరంతరం పర్యవేక్షించాలన్నారు. తీవ్ర వర్షాభావం, భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్న దృష్ట్యా రబీలో వరి సాగు చేయొద్దని రైతులకు హితవు పలికారు. తాగునీటి సరఫరా, పంటల సాగు పరిస్థితిపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ము న్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, వ్యవసా యం, విద్యుత్ తదితర శాఖల అధికారులతో శనివారం స మీక్ష నిర్వహించారు. ప్రధాన తాగునీటి వనరులు గా ఉపయోగపడుతున్న నిజాంసాగర్, శ్రీరాంసా గర్ ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వల వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖరీఫ్ పంటలను ఏదోవిధంగా కాపాడుకోగలిగినా, రబీలో సాగునీరందించడం కష్టమని అన్నా రు. విద్యుత్ ఉత్పత్తి జరగక పంటలకు కరెంటు సరఫరాకు సైతం ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు యాసంగిలో తక్కువ నీటి అవసరం ఉండే కూరగాయలు, పప్పు దినుసులు సాగు చేసేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే పది నెలల వరకు నిజామాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాలు, గ్రామాల్లో ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని , ఎక్కడ కూడా నీరు వృథాపోకుండా నిఘా సారించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన చోట్ల తాగునీటి కోసం వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప కొత్త బోర్లను తవ్వించొద్దన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతులు మోసపోవద్దు..
ప్రైవేట్ వ్యాపారులను, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులు సుదర్శన్‌రెడ్డి సూచించారు. పంట దిగుబడులను నగదుకు విక్రయించాలని, గతంలో రైతులను పలువురు వ్యాపారులు మోసగించిన సంఘటనలు ఉన్నాయన్నారు. వెంటవెంటనే నగదు చెల్లించే వారికే ధాన్యం విక్రయించాలని హితవు పలికారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా పర్యవేక్షణ
రైతులు వరి సాగు చేయొద్దు
కరెంట్ సరఫరాకూ ఇబ్బందులు తప్పవు
సమీక్షా సమావేశంలో ప్రభుత్వ
సలహాదారు సుదర్శన్‌రెడ్డి


