అర్సపల్లి ఆర్‌వోబీ పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అర్సపల్లి ఆర్‌వోబీ పనులు పూర్తి చేయాలి

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

నిజామాబాద్‌ రూరల్‌: నగర పరిధిలోని అర్సపల్లి ప్రాంతంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, ప్రభుత్వా ల ఉదాసీనత కారణంగా పనులు పూర్తి కావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని న గర అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు దీకొండ యాదగిరి అన్నారు. నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్‌వోబీ పనులను పరిశీలించా రు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. రూ.137 కోట్లతో 2023లో ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణ పనులు 2025 సెప్టెంబర్‌ నాటికి పూర్తి కా వాల్సి ఉన్నప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, వెంటనే పూర్తి చేయాలన్నారు. అర్సపల్లి అభి వృద్ధి కమిటి ప్రతినిధులు చాగంటి గంగాధర్‌, సిర్ప గంగాధర్‌, నాగయ్య, మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ అధ్య క్షుడు డాక్టర్‌ రవీంద్రనాథ్‌ సూరి, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు సిర్ప హన్మాండ్లు, ఈవీఎల్‌ నా రాయణ, ప్రసాద్‌రావు, నగర అభివద్ధి కమిటీ నా యకులు హుస్సేన్‌, మధుసూదన్‌, రాధాకిషన్‌, లింగయ్య, భూమన్న, బాలన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement