● జిల్లాలోని నాలుగు కొత్త మండలాల్లో ఉమ్మడి పాలకవర్గాలే
● నాలుగేళ్లు గడిచినా విభజనలో
కాలయాపన
బోధన్: జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాలుగు కొత్త రెవెన్యూ మండలాల్లో మహిళా సమాఖ్యల ఏర్పాటు ఎప్పుడు అని మహిళలు ఎదురు చూస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతన మండలాలు ఏ ర్పడగా.. ఇప్పటికీ ఉమ్మడి మండల సమాఖ్యలే కొ నసాగుతున్నాయి. బోధన్ రెవెన్యూ డివిజన్లో బో ధన్ మండలాన్ని విభజించి సాలూర, కోటగిరి మండలంలో పొతంగల్, ఆర్మూర్ మండలంలోని ఆలూ రు, నందిపేట మండలంలోని డొంకేశ్వర్ గ్రా మా లు కేంద్రాలుగా కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పడ్డాయి. మండలాల విభజన ప్రక్రియలో తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ శాఖ పర్యవేక్షణలో కొనసాగే మండల మహిళా సమాఖ్యల విభజన ప్రక్రియ జరగలేదు. మండల సమాఖ్యల విభజన ప్రక్రియ ఎందుకు ముందుకు సాగడం లేదో, ఇంకెంత కాలం పడుతుందో అధికార యంత్రాంగం నుంచి స్పష్టత రావడం లేదు. అయితే ఆ శాఖకు చెందిన స్థానిక అధికారులు తమ చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
నూతన పాలకవర్గాలు ఏర్పాటైతే..
కొత్త మండలాల్లో మహిళా సమాఖ్యలు ఏర్పాటు జరిగితే కొత్త పాలకవర్గం ఏర్పాటుతోపాటు స్వయం సహాయ పొదుపు మహిళా సంఘాలకు మరింత సత్వర సేవలందించే అవకాశాలు మెరుగుపడుతాయి. ప్రస్తుతం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో స్వయం సహాయక పొదుపు మహిళా సంఘాలు కీలక పాత్ర వహిస్తున్నాయనడంలో సందేహం లేదు. మహిళా సంఘాల కు బ్యాంక్ లింకేజీ రుణాలు, సీ్త్రనిధి ద్వారా స్వయం ఉపాధి పథకాలకు రుణాలు, ఇతర సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు సొంత మండలాల్లో నిర్వహించుకునేందుకు సౌలభ్యంగా మారుతుంది. ప్రస్తుతం బోధన్, కోటగిరి, నందిపేట, ఆర్మూర్ మండలాల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏపీఎంలు కొత్త మండలాలకు ఇన్చార్జి ఏపీఎంలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఉమ్మడి గ్రామ మహిళ సంఘాలు సభ్యులు
మండలం సమాఖ్యలు
బోధన్ 50 1,467 15,052
కోటగిరి 42 1,100 10,200
ఆర్మూర్ 34 1,091 11,780
నందిపేట 43 1,500 15,000


