న్యూస్‌రీల్
నిజామాబాద్
ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారుల చేతివాటం
● లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖకు పట్టుబడిన మున్సిపల్ ఉద్యోగి
● అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి సైతం అరెస్ట్
వాతావరణం
ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.
వినాయకుడికి ప్రత్యేక..
వినాయక నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గణేశ్ మండపాల వద్ద సోమవారం అన్నదానం చేశారు.
మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
– 8లో u
రెవెన్యూ మంత్రిని
కలిసిన నూతన కార్యవర్గం
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నూ తన కార్యవర్గ సభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో సోమవారం మ ర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షులు గౌ తమ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రమణ్‌రెడ్డి ని మంత్రి సన్మానించారు. అసోసియేషన్ నాయకులు వంగ రవీందర్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వసతులు కల్పించాలి
నందిపేట్(ఆర్మూర్): విద్యార్థులకు మెరుగై న వసతులను కల్పించాలని ఆర్మూర్ ఎమ్మె ల్యే పైడి రాకేశ్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే సోమవారం నందిపేట మండలంలో పర్య టించారు. కుద్వాన్‌పూర్‌లో మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల బాలుర పాఠశాలతోపా టు వసతి గృహం భవన నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. బీసీ, ఎస్సీ వసతి గృహాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
నందిపేట మండల కేంద్రంలో మినీస్టేడియం నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని, అయిలాపూర్‌లో ఎస్సీ వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించా రు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ లక్ష్మణ్,బీజేపీ మండల అధ్యక్షుడు పటేల్ల రాజు, కార్యదర్శి కస్తూరి గంగాధర్, సిరిపురం రవి, పె యింటర్ రాజు, ఆరుట్ల రమేశ్, చిన్నారెడ్డి, కంఠం సాయికుమార్, లక్కంపల్లి చిన్నయ్య, నాగతారక్, సంజీవ్, అశోక్, సిద్దాపురం మహేశ్, బాద్గుణ శివ తదితరులు ఉన్నారు.
బ్యాంకింగ్ సేవలను విస్తరించాలి
నిజామాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించాలని ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి అన్నారు. బ్యాంకుల ఏర్పాటు, బ్యాంకింగ్ సేవల విస్తరణపై దృష్టి సారించాలని సూచించారు. కంఠేశ్వర్ బైపాస్‌లో ఉన్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం లీడ్ బ్యాంక్ మేనేజర్ కే రాజుతో సమీక్ష నిర్వహించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మరిన్ని బ్యాంకింగ్ సేవలు అవసరమైన ప్రాంతాలపై ఎమ్మెల్యే చర్చించారు. ప్రజల అవసరాలు, గ్రామాల జనాభా, వ్యాపార కార్యకలాపాలు, బ్యాంకింగ్ సేవల కోసం ప్రజలు ప్రయాణిస్తున్న దూరం తదితర అంశాలను పరిశీలించి అవసరమైన చోట బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది అధికారులు లంచం ఇవ్వనిదే పనిచేయడం లేదు. కీలకమైన శాఖల్లో అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నా రు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరచూ ఏసీబీ దాడు ల్లో అధికారులు పట్టుబడుతున్నా.. కొంతమంది అధికారులు లంచగొండితనాన్ని వీడటం లేదు. తాజాగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రూ. 15 వేలు తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఏడాదిన్నరలో 14 కేసులు..
ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, ఎకై ్సజ్, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ తదితర శాఖల్లో ఎక్కువగా లంచావతారులు పట్టుబడుతున్నారు. ఆయా శాఖల్లో కొంతమంది అధికారులు పైసలు ఇవ్వకుంటే ఫైళ్లు ముట్టుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 14 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. గత ఆగస్టు నెలలోనే కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు ఓ సిమెంట్ షాపు వ్యాపారి నుంచి మొదటి విడతగా రూ.10 వేలు లంచంగా తీసుకోగా, రెండో విడతలో రూ.30 వేలు తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. గతంలో లింగంపేట పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్సైలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. గత జూలై నెలలో నిజామాబాద్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో కార్యాలయంతోపాటు ఇంటిపై దాడి చేసి నాలుగు ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్, 8 చోట్ల ప్లాట్లు, బ్యాంక్ లాకర్లలో కిలో బంగారం, 70 తులాల వెండి, రూ.3 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులను గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కల్లు దుకాణం ఓ చోటు నుంచి మరో చోటికి తరలించేందుకు దుకాణ యజమానుల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
సొంత ఉద్యోగులనే పీడిస్తూ..
వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ప్రజల నుంచి లంచం తీసుకోవడమే కాకుండా, ఏకంగా తోటి ఉద్యోగుల నుంచి కూడా లంచం వసూలు చేయడం తీవ్రత ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ అశోక్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కిరణ్ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఇంక్రిమెంట్‌తోపాటు తన తల్లి పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న క్రమంలో అతని నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తా సమీపంలోని పద్మశాలి సంఘ భవనం వద్ద రూ.15 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయాలకు వచ్చే సాధారణ ప్రజల నుంచే కాకుండా అదే శాఖలో పనిచేసే ఉద్యోగుల నుంచి సైతం లంచాలు తీసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.
ఉద్యోగంలో చేరిన 13 నెలలకే..
ఎస్‌ఐఆర్ దరఖాస్తులను..
నిజామాబాద్ అర్బన్: ఉద్యోగం చేరిన 13 నెలలకే లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి ఏసీబీకి ప ట్టుబడ్డాడు. అదీ మాతృశాఖలో పని చేసి రిటైర్ అయి న ఉద్యోగి నుంచి డబ్బులు తీసుకుంటూ.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ మున్సిపల్ కార్పొరేషన్ లో పదవీ విరమణ చేసింది. ఆమెకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మున్సిపల్ కార్యాలయంలోని ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌ను ఆశ్రయించింది. పని కావాలంటే ముందుగా డబ్బులు ఇవ్వాలని ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ అశోక్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కిరణ్‌కుమార్ రూ.35వేలు డిమాండ్ చే శారు. ముందుగా రూ.15 వేలు ఇవ్వాలన్నారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారంబాధితురాలి కుమారుడు సీతారాంనగర్ కాలనీ పద్మశాలి సంఘం వద్ద ఇద్దరు ఉద్యోగులకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారించారు. మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా పనిచేసి మరణించిన అమ్మాయి కుమారుడు అశోక్ కారుణ్య నియామకం కింద 13 నెలల క్రితం ఉద్యోగం చేరాడు. ఉద్యోగం వచ్చిన కొన్ని నెలలకే లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు పట్టుబడ డం చర్చనీ యాంశమైంది. ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.
ఏ శాఖకు వెళ్లినా అదే పరిస్థితి!
ఉమ్మడి జిల్లాలో తరచూ
ఏసీబీకి పట్టుబడుతున్న వైనం
తాజాగా నిజామాబాద్
కార్పొరేషన్‌లో ఏసీబీ దాడుల కలకలం
సొంత శాఖలో ఉద్యోగుల నుంచి సైతం వసూళ్ల పర్వం


