భూపరిహారం వెంటనే చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

భూపరిహారం వెంటనే చెల్లించాలి

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

అదనపు నిధులు అవసరమైతే

ప్రతిపాదనలు పంపండి

వీడియోకాన్ఫరెన్స్‌లో

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌: నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్‌ భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనుల పురోగతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో కలిసి మంత్రి ఉత్తమ్‌ సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని, 2026–27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణకు మొత్తం రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.1,050 కోట్లు, మరోసారి రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. అయితే విడుదలైన నిధుల్లో సింహభాగం ఇప్పటికీ అధికారుల ఖాతాల్లోనే ఉండి, లబ్ధిదారులకు అందించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భూసేకరణ లబ్ధిదారులకు పరిహారం చెల్లింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. నిధులు చాలకపోయినా, ఇతర కారణాల వల్ల చెల్లింపులు సాధ్యం కాకపోతే ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు అందించాలని సూచించారు. పరిహారం నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, అదనపు కలెక్టర్‌ భుజంగరావు, నిజామాబాద్‌, బోధన్‌ ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయకుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ దరఖాస్తులను..

నిజామాబాద్‌ అర్బన్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా స్వీ కరించిన ఫారం–6, 7, 8 దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎ న్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి సోమవారం జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్‌ దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సమీక్షించారు. మ్యాపింగ్‌ జరగని, పేరు, ఇతర వివరాలలో వ్యత్యాసం కలిగి ఉన్న వారికి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసులకు సంబంధించిన విచారణ పక్కాగా జరపాలన్నారు. నోటీసులు జారీ కానివారికి వెంటనే నోటీసులు అందజేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఎల్‌ఏల ద్వారా నోటీసులు అందించవద్దని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement