డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

మాక్లూర్‌: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈగల్‌ ఫోర్స్‌ ఏసీపీ సోమనాథం సూ చించారు. సోమవారం విజయ్‌ రూరల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్థానిక ఎస్సై అనిల్‌ రెడ్డి అధ్యక్షతన డ్రగ్స్‌పై జరిగిన అవగాహన సదస్సుకు సోమనా థం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా విద్యపై శ్రద్ధ చూపాలే తప్ప తప్పు డు మార్గాల వైపు వెళ్లకూడదని అన్నారు. సీఐ పూర్ణచందర్‌, ఏఎస్సై లక్ష్మణ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యుత్‌ సమస్యలు

తలెత్తకుండా చూడాలి

ఆర్మూర్‌: వినాయక నిమజ్జనం సందర్భంగా దారి పొడవునా విద్యుత్‌ ప్రమాదాలు తలెత్తకుండా, వి ద్యుత్‌ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాల ని విద్యుత్‌ శాఖ సీఈ నాగ ప్రసాద్‌ సిబ్బందికి సూచించారు. ఆర్మూర్‌ పట్టణంలో వినాయక శోభాయాత్ర నిర్వహించే దారిని, నిమజ్జనం నిర్వహించే గూండ్ల చెరువును సోమవారం ఆయన పరిశీలించారు. ఆర్మూర్‌ విద్యుత్‌ డీఈ రాజుకు పలు సూచనలిచ్చారు. ఏఈలు నజ్మా, సాయి వినాయక్‌, విద్యుత్‌ సిబ్బంది ఉన్నారు.

న్యాయం చేయండి

ఆర్మూర్‌: పెర్కిట్‌ శివారులో తమకు చెందిన ఒక ఎకరం 24 గుంటల వ్యవసాయ భూమి యాజమాన్య పట్టా మార్పిడిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖాందేశ్‌ నీరజ, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్నాన్‌ మాల్వియాకు ఫిర్యాదు చేశారు. ఆర్మూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈమేరకు ఫిర్యాదు ఇచ్చారు. 2003లో తమ మామ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన భర్త ఖాందేశ్‌ గంగాధర్‌ సోదరులు రాజేశ్వర్‌, సుందర్‌ అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముగిసిన పాలకవర్గాల గడువు

కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి, వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీల పాలకవర్గాల గడువు ఆదివారంతో ముగిసింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం కమ్మర్‌పల్లి, వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీలకు రెండేళ్ల పాటు పాలకవర్గాలను ఖరారు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. పాలకవర్గం గడువు ముగియడంతో చైర్మన్‌లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి తమను మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని కోరినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement