ఆర్మూర్‌టౌన్: వినాయక నిమజ్జన శోభాయాత్రలో సౌండ్ సిస్టమ్ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాల ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమి టీ చైర్మన్ సాయిబాబాగౌడ్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ని కోరారు. ఈ మేరకు ఏసీసీ కార్యాలయంలో విన తి పత్రం అంజేశారు. కౌన్సిలర్‌లు నర్మె నవీన్, భూ పేందర్, తాటి హన్మాండ్లు, గంగాధర్ గౌడ్, నాయకులు రఘు, బబ్లూ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
శోభాయాత్రల్లో డీజేల నిషేధం
రుద్రూర్/బోధన్ టౌన్: గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా నిర్వహించే శోభాయాత్రల్లో డీజే సౌండ్ సిస్టంను వినియోగించొద్దని రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్, బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణలు వేర్వేరుగా గణేశ్ మండపాల నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనోత్సవాలను ప్రశాంత ంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని కోరారు.


