స్వచ్ఛతా హీ సేవపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతా హీ సేవపై అవగాహన

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

బోధన్‌: ఎడపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై సర్పంచ్‌ కందగట్ల రాంచందర్‌ అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎల్‌పీవో నాగరాజు మాట్లాడుతూ.. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. శ్రమదానం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ ఎడపల్లి లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈవో మోహన్‌, జీపీ కార్యదర్శి గంగాధర్‌, ఎస్‌బీఎం కో–ఆర్డినేటర్‌ రాజు, హెచ్‌ఎం రవికుమార్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement