బోధన్‌ సొసైటీ మహాజన సభ | - | Sakshi
Sakshi News home page

బోధన్‌ సొసైటీ మహాజన సభ

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

బోధన్‌రూరల్‌: బోధన్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సోమవారం మహాలక్ష్మి కల్యాణ మండపంలో అధ్యక్షుడు ఉద్మీర్‌ లక్ష్మణ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘ కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు హాజరై పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. జమ–ఖర్చులు, లాభ–నష్టాల వివరాలతో పాటు 2026–27 సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్‌ను సంఘ కార్యదర్శి ఉమాకాంత సభలో చదివి వినిపించారు. అనంతరం సభ్యులు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.

రుద్రూర్‌ గ్రామసభలో గందరగోళం

రుద్రూర్‌: మండల కేంద్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సోమవారం నిర్వహించిన గ్రామ సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. అర్హులైన నిరుపేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇళ్లు కేటాయించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. గ్రామ సర్పంచ్‌ ఇందూర్‌ సునీత చంద్రశేఖర్‌ అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ తారాబాయి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను వివరించారు. అనంతరం లబ్ధిదారుల జాబితాను చదివే ప్రయత్నం చేయగా.. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను ఎలా కేటాయిస్తారని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నించారు. ముందుగా ఇళ్లను పూర్తిచేసి నిరుపేదలకు అందించాలని డిమాండ్‌ చేశారు. సభలో కొద్దిసేపు వాగ్వాదం, గందరగోళం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్న శాంతింపజేశారు. సభలో ఉపసర్పంచ్‌ షేక్‌ నిసార్‌, మాజీ జెడ్పీటీసీ నరోజి గంగారాం, మాజీ సర్పంచ్‌ ఇందూర్‌ చంద్రశేఖర్‌, విండో మాజీ చైర్మన్‌ పత్తి రాము, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement