బోధన్: ప్రతి రైతు పంట మార్పిడి విధానం పాటించాలని జగిత్యాల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు సూచించారు. గ్రామీణ వ్యవసాయ అనుభ వం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాలూర మండల కేంద్రంలో విద్యార్థినులు రైతులతో సమా వేశమై ఎరువుల సమతుల్యం అంశంపై అవగాహన కల్పించారు. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం పద్ధతులు, మొక్కల్లో పోషకలోపం గుర్తించడం విషయాలను వివరించారు. అనంతరం గ్రామ శివారులోని ఆదర్శ రైతు కేజీ గంగారాం పంట పొలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


