ఒకే ఊరు.. ఒకే గణపతి
నిజామాబాద్ అర్బన్: గణేశ్ శోభాయాత్ర, నిమజ్జ నానికి పోలీసుశాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తోంది. సీపీ సాయిచైతన్య ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మంగళవారం వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బందోబస్తు విధుల కోసం 1300 మంది పోలీస్ సిబ్బందిని ని యమించడంతోపాటు 200 సీసీ కెమెరాలు ఏర్పా టు చేశారు. అలాగే డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా సారించనున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎకై ్సజ్, ఫారెస్ట్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ పోలీస్ సిబ్బందితో కలిసి పనిచేయనున్నాయి.
నిబంధనలు పాటించాలి
శోభాయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరూ పోలీసుశాఖ సూచించిన నిబంధనలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు కనిపించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఆడియో సిస్టం నిర్ణీత స్థాయిలోనే ఉపయోగించాల, డీజేలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. పుకార్లను నమ్మొద్దని, మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొంటే చర్యలు తప్పవన్నారు. అత్యవసర సమయంలో 112 నంబర్‌కు డయల్ చేయాలని, అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 59700 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
మద్యం దుకాణాల మూసివేత
శోభాయాత్ర సందర్భంగా మద్యం షాపులను మూసివేయనున్నట్లు సీపీ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలతోపాటు కల్లు డిపోలు, బార్‌లు మూసి ఉంటాయని పేర్కొన్నారు.
ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా
సుభాష్‌నగర్: గణేశ్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఎన్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ (సీఈ, కమర్షియల్) నాగ ప్రసాద్ సూచించారు. గణేశ్ శోభాయాత్ర, ప్రజా సమీకరణ, విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా ఏర్పాట్లను నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం పరిశీలించారు. నందిపేట్ సెక్షన్ పరిధిలోని ఉమ్మెడ గోదావరి నిమజ్జన ప్రాంతాన్ని కూడా చీఫ్ ఇంజినీర్ సందర్శించి డీఈ ముక్తార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలకు అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట టౌన్–2 ఏడీఈ ఆర్ ప్రసాద్‌రెడ్డి, నందిపేట్ ఏడీఈ అశోక్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ రూరల్: మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామస్తులంతా కలిసి ఒకే మండపాన్ని ఏర్పాటు చేసి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించారు. ‘ఒకే ఊరు – ఒకే గణపతి’ నినాదంతో గ్రామస్తులంతా కలిసి గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప ర్యావరణ హితాన్ని కోరుతూ తిర్మన్‌పల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన మట్టి గణపతిని సీపీ సాయిచైతన్య సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యువతను, గ్రామస్తులను సీపీ అభినందించారు. సర్పంచ్ కౌలాస్ మోహన్ సీపీని సన్మానించారు. రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
వినాయక శోభాయాత్రకు పటిష్ట
బందోబస్తు
డ్రోన్ కెమెరాలతో నిఘా
మద్యం దుకాణాల మూసివేత
నేడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో
వినాయక నిమజ్జనం


