నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 111 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ భవేశ్‌మిశ్రా, అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్‌వో గీత, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్, ట్రెయినీ ఆర్డీవో సందీప్‌కు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


