వైరల్‌ ఫీ‘వర్రీ’ | - | Sakshi
Sakshi News home page

వైరల్‌ ఫీ‘వర్రీ’

Sep 13 2026 1:24 AM | Updated on Sep 13 2026 1:24 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

వంతెనలు నిర్మించారు..

నూతనంగా నిర్మించిన వంతెనలకు ఇరువైపులా సీసీ వేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

– 8లో u

నిజామాబాద్‌అర్బన్‌: వాతావరణంలో మార్పులతో ప్రజలు జ్వరాలతో విలవిలలాడుతున్నారు. జిల్లా లో వైరల్‌ ఫీవర్‌ కేసులు ఉన్నఫలంగా రెండింతలయ్యాయి. గత నెల నుంచి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దలు సైతం జ్వరాల బారినపడుతున్నారు. ప్రధానంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ తదితర కేసులతో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రయివేటు ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. ఆగస్టు నుంచి ఈ నెల 11 వరకు జీజీహెచ్‌కు డెంగీతో బాధపడుతున్న 53 మంది, మలేరియా బాధితులు నలుగురు చేరారు. వైరల్‌ ఫీవర్‌తో 2,609 మంది చికిత్స పొందారు.

కరువైన పర్యవేక్షణ..

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖల పర్యవేక్షణ కొరవడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల్లో దోమల పెరుగుదలను అరికట్టి, మురికి కూపాలను నిరోధించాల్సిన అవసరం ఉంది. ఇళ్లల్లో నీటి నిల్వ ప్రాంతాలను నివారించడం, వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా అవేమీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ ప్రతి శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూనే ఇంటింటి సర్వేలను చేపట్టి నివారించాల్సి ఉంటుంది. అయితే, కార్యక్రమంపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేదనే ఆరోపణలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఖాళీ స్థలాల్లో నీరు నిలువడం, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండటమే వ్యాధుల బారినపడేందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ప్రయివేటు ఆస్పత్రులకు జ్వరం, గొంతు నొప్పి, ద గ్గు, కళ్ల కలక ఇతర సమస్యలతో జనం వస్తున్నారు. చిన్న పిల్లల ఆస్పత్రులు సైతం రో గులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోనూ ఉదయం వేళ ఓపీ పెరిగింది.

కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

రోగుల తాకిడి పెరిగింది

జీజీహెచ్‌కు రోగులు తాకిడి పెరిగింది. కొన్నిరోజులుగా జ్వరాలు, ఇతర వ్యాధులు పెరిగాయి. జిల్లాలో నలువైపులా రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధులపై అవగాహన కలిగి ఉంటే ఎంతో మేలు. – డాక్టర్‌ రాములు,

జీజీహెచ్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement