వ్యవసాయానికి 18 గంటల విద్యుత్‌ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి 18 గంటల విద్యుత్‌ ఇవ్వాలి

Sep 13 2026 1:24 AM | Updated on Sep 13 2026 1:24 AM

లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడండి

విద్యుత్‌ ఎస్‌ఈకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ వినతి

సుభాష్‌నగర్‌: వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాలో లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, రో జుకు 18 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సర ఫరా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటే ల్‌ కులాచారి డిమాండ్‌చేశారు. ఈమేరకు శనివారం నగరంలోని విద్యుత్‌భవన్‌లో ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దినేశ్‌ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా రైతాంగం సుమారు 2.5 లక్షల వ్యవసాయ పంపుసెట్ల కింద దాదాపు 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారని తెలిపారు. ప్రభు త్వం రైతులకు అవసరమైన విద్యుత్‌ను అందించడంలో ఘోరంగా విఫలమైందని, ప్రస్తుతం సరఫరా చేస్తున్న 7 నుంచి 8 గంటల కరెంట్‌ కూడా లో ఓల్టేజీతో వస్తుండటంతో బోరుమోటార్లు కాలిపో తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సకాలంలో నీరందక అన్నదాతలు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్‌ అధికారులు స్పందించి ఎలాంటి లో ఓల్టేజీ, సరఫరా అంతరాయం లేకుండా రోజుకు 18 గంటల నాణ్యమైన కరెంట్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితిలో మార్పు లే కుంటే రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నాయకులు, కార్పొరేటర్లు లక్ష్మీనారాయణ, ప్రమోద్‌కుమార్‌, తిరుపతిరెడ్డి, గంగారెడ్డి, కర్క గంగారెడ్డి, తోట చిన్నయ్య, రాజేశ్వ ర్‌ రెడ్డి, అన్నం గోపి, పద్మారెడ్డి, జగన్‌రెడ్డి, ఆనంద్‌, శంకర్‌ రెడ్డి, నాయిడి రాజన్న, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement